76 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం చెక్కుచెదరని గ్లామర్, ఫిట్నెస్… దీనికి కారణం 36 ఏళ్లుగా ఆది తినకపోవడమేనా..!!

75ఏళ్ల వయసు దాటిన తర్వాత 30సంవత్సరాల వయసున్న మహిళగా కనిపించడం అనేది సాధారణమైన విషయం అయితే కాదు. కాని ఆస్ట్రేలియాకు చెందిన కరోలిన్ హెర్ట్జ్ మాత్రం చేసి చూపించింది. తన హెల్త్, బ్యూటీ సీక్రెట్ బయటపెట్టింది. ఆస్ట్రేలియాకు చెందిన కరోలిన్ హెర్ట్జ్ అనే ఓ 76 ఏళ్ల స్త్రీ తన వయసు ఏమాత్రం తెలియకుండా కవర్ చేస్తుంది. ఈ ఓ ల్డ్ లేడీ అందమైన శరీర సౌస్టవాన్ని కలిగి ఉంది. జీరో సైజ్ ఫిజిక్, ప్రకాశవంతమైన స్కిన్‌తో ఇంకా నవయువతిలాగానే కనిపిస్తోంది. ఆమె అందాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

విచిత్రం ఏమిటంటే బేకర్ హెర్ట్జ్ గత 35 సంవత్సరాలుగా చక్కెర అస్సలు తినలేదు. ఆమెకు 41 సంవత్సరాల వయస్సులో ప్రీ-డయాబెటిక్ వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుసుకుంది. ఆ తర్వాత చక్కెరతో తయారు చేసిన ఏ పదార్ధాన్ని ముట్టుకోలేదని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించింది.చక్కెరకు బదులుగా ఆమె ఆహారంలో తీపి కోసం జిలిటాల్‌ను ఉపయోగిస్తుంది. జిలిటాల్ అనేది కృత్రిమ చక్కెర. ఇది సహజ చక్కెర నుండి చాలా భిన్నంగా ఉంటుంది.

పాలీయోల్స్ అని పిలువబడే చక్కెరకు బదులుగా వాడే తీపి పదార్ధాల్లో ఇదొకటి.సహజంగా 70 వయసు దాటిందంటే ..శరీరం అంతా ముడతలు పడి..జుట్టు రాలిపోవడం, లేదా తెల్లబడటం జరుగుతుంది. అలాగే శరీర అవయవాలు కూడా వంగిపోయి..వృద్దాప్య ఛాయలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి. కాని హెర్ట్జ్ తన గ్లామర్, ఫిట్‌నెస్‌ని 76సంవత్సరాలు వచ్చినప్పటికి పదిలంగా కాపాడుకుంటోంది. 45 ఏళ్ల నుంచి బాస్కెట్‌బాల్‌ ఆడుతున్నానని, 65 ఏళ్ల నుంచి యోగా చేస్తానని, రోజూ 8 గంటలు నిద్రపోతున్నానని చెప్పింది.హెర్ట్జ్ 45 ఏళ్ల వయసులో స్వీట్‌ లైఫ్ అనే కంపెనీని స్థాపించింది.

చక్కెరకు ప్రత్యామ్నాయాల గురించి ఇక్కడ అందరికి సమాచారాన్ని అందిస్తుంది. ఆమె వెబ్‌సైట్ ద్వారా చక్కెరకు బదులుగా జిలిటాల్ తీసుకోవాలని ప్రజలకు చెబుతుంది. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ స్విమ్‌ లేడీకి చెందిన కంపెనీ ఉత్పత్తులలో స్వీటెనర్‌గా ఉపయోగిస్తోంది. ‘సహజ చక్కెర కంటే జిలిటోల్‌ చాలా ప్రమాదకరం’ అంటున్నారు నిపుణులు. కరోలిన్‌ తన లుక్స్‌లోని రహస్యాలను బయటపెడుతుందనే సాకుతో తన కంపెనీ ఉత్పత్తులను ప్రచారం చేస్తోందనే వాదనలు తెరపైకి వచ్చాయి. 40 ఏళ్లు దాటిన మహిళల బరువు గురించి కూడా ఆమె తన ఇంటర్వ్యూలో తెలిపింది. వయస్సు పెరిగేకొద్దీ మన జీవక్రియ మందగిస్తుందని..దాని అర్థం మనం నియంత్రణలో ఉండాలని.. ఆరోగ్యకరమైన ఎంపికలు చేసుకోవాలని చెబుతోంది. అలాగే శరీరం, ఆరోగ్యం కోసం కొంచెం కష్టపడక తప్పదని తన గ్లామర్ సీక్రెట్‌ని ఓపెన్‌గా చెప్పేసింది