అక్కినేని కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ హీరో అయినా నవమన్మధుడులా ఇప్పటికి మంచి ఫిజిక్ తో యంగ్‌గా కనిపిస్తూ ఉంటాడు. అందం, నటనతో కొడుకులతో పోటీ పడుతున్న నాగార్జున మొదటి నుంచి కొత్త దర్శకులకు ఎక్కువ ఛాన్స్ ఇస్తూ ఉంటాడు. నాగార్జున ఇప్పటికే చాలామంది కొత్త డైరెక్టర్‌లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇప్పుడు ఆ దర్శకులు ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అయిపోయారు. కొత్త డైరెక్టర్స్ కు ఛాన్స్ ఇవ్వడమే కాదు ఆ డైరెక్టర్స్ తో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హీట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమాలేంటో ఒకసారి చూద్దాం
శివ:
నాగార్జున హీరోగా నటించిన శివ సినిమా గుర్తుండే ఉంటుంది. రామ్‌గోపాల్ వర్మ ఈ సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. నాగార్జునకు బ్లాక్ బస్టర్ హీట్ ఇచ్చిన ఈ సినిమా పాటలు ఇప్పటికి వింటున్నాం.అపట్లో ట్రెండ్ సెట్టర్గా ఉన్న ఈ మూవీ నాగ్ సినీ కెరీర్ లో టర్నింగ్ పాయింట్‌గా చెప్పవచ్చు.
నువ్వు వస్తావని :
వి ఆర్ ప్రతాప్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన మొదటి సినిమా నువ్వు వస్తావని. ఈ సినిమాతో నాగార్జున ప్రతాప్‌కు అవకాశం ఇచ్చారు. ఇప్పటికీ సినిమాలో పాటలు ఎవర్గ్రీన్గా వినిపిస్తూనే ఉన్నాయి. నాగార్జున కెరీర్‌లో అన్నమయ్య తర్వాత మళ్లీ గ్రాండ్ సక్సెస్‌ని అందుకున్న సినిమా ఇదే. తుళ్లదా మనముమ్ తుళ్ళుమ్ అనే తమిళ సినిమాకు ఇది రీమేక్.
నిన్నే ప్రేమిస్తా :
ఆర్ఆర్ షిండే దర్శకత్వం వహించిన ఈ సినిమా నాగ్కి బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందించింది. తమిళ్ చిత్రం నీ వరువాయ ఎనా ఆధారంగా ఈ సినిమాను తలకెక్కించారు.
సంతోషం :
శ్రియ హీరోయిన్‌గా.. కళాతపస్వి కే.విశ్వనాథ్ నటించిన ఈ సినిమా నాగార్జున కెరీర్‌లోనే ఎంతో స్పెషల్ సినిమాగా చెప్పవచ్చు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో దశరధ్ దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు.
మాస్ :
అప్పటివరకు కేవలం క్లాస్ సినిమాలోనే కనిపించిన నాగ్‌ను మాస్‌గా చూపించిన సినిమా మాస్. అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకు రాఘవ లారెన్స్ డైరెక్టర్గా పని చేశాడు. ఈయన మంచి డాన్సర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కూడా లారెన్స్ నటించాడు.
సోగ్గాడే చిన్నినాయన :
నాగార్జున కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో సోగ్గాడే చిన్నినాయన కూడా ఒకటి. ఈ సినిమా నా కెరీర్‌లోనే హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసింది. సినిమాలకు చాలా గ్యాప్ తర్వాత నాగార్జున ఈ సినిమాతో అదిరిపోయే లూక్స్ లో ఇండస్ట్రీకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మొదటి సినిమా ఇదే కావడం విశేషం.