చరిత్ర క్రియేట్ చేసిన శ్రీలంక క్రికెట్ టీం… ప్ర‌పంచంలోనే తొలి జ‌ట్టుగా రికార్డ్‌..!

ఆసియా కప్ 2023లో భాగంగా శ్రీలంక తొలి బోనీ కొట్టింది.. పల్లెకెలె వేదికగా బంగ్లాదేశ్ లో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 42.4 ఓవర్లలో 164 పరుగులకే ఆల్ అవుట్ అయింది.. బంగ్లా బ్యాట్స్మెన్లలో నజుముల్‌ హొసేన్‌ శాంటో 89 పరుగులు చేశాడు.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా ఫెయిల్ అయ్యారు.

ఇక శ్రీలంక బౌలర్లలో ప్రస్తుత యువ సంచలనం మతీశా పతిరన నాలుగు వికెట్లతో బంగ్లాను బాగా దెబ్బతీశాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 39 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టానికి 165 పరుగులు చేసి విజయం సాధించింది. చరిత్‌ అసలంక (92 బంతుల్లో 62 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌), సమరవిక్రమ (77 బంతుల్లో 54; 6 సిక్స్‌లు) రాణించారు.

చరిత్ర సృష్టించిన శ్రీలంక..
అయితే ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓ అరుదైన రికార్డును తన‌ ఖాతాలో వేసుకుంది. వన్డేల్లో వరుసగా అత్యధిక సార్‌లు ప్రత్యర్థి జట్టును ఆలౌట్‌ చేసిన టీమ్‌గా శ్రీలంక రికార్డ్ ఎక్కింది.. ఈ మ్యాచ్ బంగ్లాదేశ్ ను ఆల్ అలౌట్ చేసిన శ్రీలంక ఈ ఘనతను తన పేరున రాసుకుంది. శ్రీలంక వరుసగా 11సార్లు ప్రత్యర్ది జ‌ట్టును అలౌడ్ చేసింది.. అంతకుముందు ఇదే రికార్డ్ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా పేరిట ఉండేది.. ఈ రెండు జట్లు వరుసగా 10సార్లు ప్రత్యర్థి జ‌ట్టును ఆలౌట్‌ చేశాయి.