భోళా శంకర్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు నష్టమంటే..?

ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిరంజీవి తమ బంధువైన డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాల్లో నటించారు.. ఈ సినిమా మొదటి నుంచి పెద్దగా బజ్ ఏర్పడకపోవడంతో విడుదలైన మొదటి రోజు ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఈ సినిమా చిరంజీవి కెరియర్ లోనే ఒక డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా క్లోజింగ్ కలెక్షన్ల విషయానికి వస్తే చాలా దారుణమైన కలెక్షన్లను రాబట్టినట్లుగా తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.

Chiranjeevi's Bhola Shankar OTT streaming date locked - TrackTollywood

చిరంజీవి కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీస్ ఫ్లాప్ మూవీస్ ఉన్నాయి. 1990లో కూడా చిరంజీవి బిగ్ బాస్, రిక్షావాడు వంటి దారుణమైన ఫ్లాపుల తర్వాత మళ్లీ నిలబడడం జరిగింది..ఆ తర్వాత ఆచార్య సినిమాతో ఫ్లాపులను చూసిన చిరంజీవి గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్యతో మంచి విజయాలను అందుకున్నారు.. అయితే ఈసారి మాత్రం భోళా శంకర్ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూట కట్టుకున్నారు ..ఈ సినిమా వారంలోపే థియేటర్లో కనీసం మెయింటైన్ ఖర్చులు కూడా రాలేదట. అంతలా నెగెటివిటీ పెరిగిపోయింది.

ఆగస్టు 25న భోళా శంకర్ విడుదలైన ఫ్లాప్ గా మిగిలింది.. అయినప్పటికీ ఈ సినిమాని హిందీలో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి.. కానీ ఓటిటిలో ఈ సినిమా అన్ని భాషల్లో స్త్రిమ్మింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ ముగిసే సమయానికి. రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.25,44 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.29.50 కోట్లను మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. దాదాపుగా 80 కోట్ల రూపాయల రేంజ్లో టార్గెట్ బరిలోకి దిగిన ఈ సినిమా రూ .50 కోట్ల రూపాయలకు పైగా నష్టాన్ని మిగిలింది.. కేవలం భోళా శంకర్ సినిమా 36.5 శాతాన్ని మాత్రమే రికవరీ చేసినట్లు తెలుస్తోంది చిరంజీవి కెరీర్ లోనే అతి దారుణమైన సినిమాగా నిలిచింది..