సమంతకు ఊహించని షాక్ ఇచ్చిన మేనేజర్.. మరో కష్టం వచ్చి పడిందే..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత త్వరలోనే ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతుంది. ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న సమంత.. వెంటనే అమెరికాకు వెళ్ళిపోయింది. మయోసైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటుందని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయినా.. ప్రస్తుతం ఆమె వెకేషన్ ఎంజాయ్ చేయడానికి, హాలీవుడ్ సినిమాల్లో చాన్సుల కోసం ఆడిషన్స్‌కు అమెరికా వెళ్ళింది అంటూ కూడా ఓ పక్కన వార్తలు వైరల్ అవుతున్నాయి. అయ‌తే ఈ టూర్‌లో సమంతకు మేనేజర్ తరఫునుంచి షాక్ ఎదురైందట. ఆమె మేనేజర్ ఆమెను మోసం చేశాడనే సమాచారం వినిపిస్తుంది.

ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్స్‌ లవాదేవిలన్ని తమ మేనేజర్లు చూసుకుంటారు. పారితోషికాల గురించి కూడా వారే మాట్లాడుతూ ఉంటారు. సమంత మేనేజర్ దీన్ని అవకాశంగా భావించి సమంత డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ కంటే నిర్మాతల దగ్గర ఎక్కువగా దండుకున్నాడట. ఈ విషయం తెలిసిన సమంత ఆశ్చర్యపోయిందని అమెరికాకి వెళ్ళిన తరువాతే సమంతకు ఈ న్యూస్ తెలిసిందని సమాచారం. అతడు సుమారు రూ.కోటి పైన సమంతను మోసం చేశాడు. ప్రస్తుతం ట్రీట్మెంట్ నిమిత్తం అమెరికాకు వెళ్లిన సమంత అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేయగా ఈ విషయాలు బయట పడ్డాయట. ఇక సమంత దగ్గర పదేళ్లుగా మేనేజర్‌గా పనిచేస్తున్న ఆ వ్యక్తిపై సమంత కూడా ఎంతో నమ్మకం పెంచుకుంది.

చాలామంది ప్రొడ్యూసర్స్ కూడా మేనేజర్ ని తీసివేయాలని సమంతకు సూచించినా పదేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న వ్యక్తిని తీసివేయడం కుదరదని ముఖం మీద చెప్పేసిందట. అలాంటి వ్యక్తి ఆమెను మోసం చేసాడు అన్న విషయం తెలియడంతో సమంత షాక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు. మేనేజర్ ఆమెను నిజంగానే మోసం చేశాడా.. లేదా కావాలని ఎవరైనా ఈ వార్తను క్రియేట్ చేశారా.. అంటూ నిటిజన్‌లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సమంత స్పందిస్తే కానీ ఈ విషయం తెలియదు.