పోలవరంలో టీడీపీకి అదే పెద్ద మైనస్..!

పోలవరం నియోజకవర్గం..ఏపీలో ఇదొక ప్రత్యేకమైన సీటు. ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఉన్న నియోజకవర్గం కావడంతో..ప్రజల దృష్టి మొత్తం దీనిపైనే ఉంది. ఎస్టీ రిజర్వ్ సీటుగా ఉన్న ఈ పోలవరంలో మొదట నుంచి కాంగ్రెస్ హవా ఉండేది. గతంలో కాంగ్రెస్ లో తెల్లం బాలరాజు రెండుసార్లు గెలిచారు. తర్వాత వైసీపీలోకి వచ్చాక 2012 ఉపఎన్నికలో గెలిచారు. కానీ 2014 ఎన్నికల్లో సీన్ మారిపోయింది. ఇక్కడ టి‌డి‌పి సత్తా చాటింది.

టి‌డి‌పి నుంచి మోడియం శ్రీనివాసరరావు విజయం సాధించారు..కానీ 2019 ఎన్నికలకు వచ్చేసరికి టి‌డి‌పి అభ్యర్ధిని మార్చారు. మోడియం ప్లేస్ లో బొరగం శ్రీనివాసరావుని బరిలో దింపారు. జగన్ వేవ్ లో టి‌డి‌పి ఓడిపోయింది. వైసీపీ నుంచి తెల్లం బాలరాజు దాదాపు 42 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇంత మెజారిటీ ఇచ్చిన బాలరాజు..పోలవరంకు చేసిందేమి లేదు. అభివృద్ధి శూన్యం..గిరిజన గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. అటు పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పాల్సిన పని లేదు. నిర్వాసితులని ఆదుకున్న దాఖలాలు లేవు.

ఈ పరిణామాలు వైసీపీకి మైనస్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇంచార్జ్ గా ఉన్న బొరగం యాక్టివ్ గానే పనిచేస్తున్నారు..కాకపోతే అటు మాజీ ఎమ్మెల్యే మోడియం సైతం దూకుడుగా పనిచేస్తున్నారు. ఇలా ఇద్దరు నేతలు పనిచేయడంతో టి‌డి‌పిలో కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ వైసీపీపై వ్యతిరేకత ఉంది..అది టి‌డి‌పికి ప్లస్ అవుతుందనుకునే తరుణంలో..టి‌డి‌పిలో సీటు ఎవరికి అనేది పెద్ద చర్చగా మారింది.

ఇంతవరకు సీటు విషయంలో క్లారిటీ రాలేదు. అయితే ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించేలా లేరు. దీని వల్ల అంతిమంగా టి‌డి‌పికే నష్టం జరిగేలా ఉంది.