కోలీవుడ్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.ఈ సినిమాని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా రమ్యకృష్ణ, తమన్నా, యోగిబాబు, మోహన్ లాల్ ,శివరాజ్ కుమార్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 11న గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనిరుద్ అదిరిపోయేలా ఇచ్చారని చెప్పవచ్చు.
దాదాపుగా ఈ సినిమా రూ .600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇటీవలే హెచ్డి ప్రింట్ బయటికి వచ్చినప్పటికీ కూడా కలెక్షన్ల పరంగా బాగానే ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి గాను రజనీకాంత్ కి రూ.110 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నట్లుగా వార్తలు వినిపించాయి.. సన్ పిక్చర్ బ్యానర్ పై ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే ఇటీవలే లాభాలు భారీగా రావడంతో అదనంగా మరొక రూ .100 కోట్ల రూపాయల చెక్ అందజేశారు నిర్మాత కళానిధి మారన్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా ఫేక్ అనే ప్రచారం కూడా జరుగుతోందని ..అన్ని కోట్ల రూపాయలు ఇస్తే వారికి ఏం మిగులుతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ..మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి.
దీంతో రజనీకాంత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న యాక్టర్ గా మరొక రికార్డును సైతం క్రియేట్ చేసుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఓటిటి రిలీజ్ డేట్ పై పలు రకాల రూమర్లు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా సెప్టెంబర్ 7న ఓటీటి లో స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తమిళ, తెలుగు ఓటీటి రైట్స్ సన్ నెక్స్ట్ కలిగి ఉంది హిందీ డబ్బింగ్ రైట్స్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రిమింగ్ కాబోతున్నట్లు సమాచారం.
Mr. Kalanithi Maran met Superstar @rajinikanth and handed over a cheque, celebrating the historic success of #Jailer pic.twitter.com/Y1wp2ugbdi
— Sun Pictures (@sunpictures) August 31, 2023