నిన్ను కోరి సినిమా చూసి నన్ను కోరింది.. ఖుషి మూవీ డైరెక్టర్ శివ నిర్వాణ క్యూట్ లవ్ స్టోరీ..

సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటించిన ఖుషి సినిమా కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకత్వం వహించిన శివ నిర్వాణ గతంలో నిన్ను కోరి, మజిలీ లాంటి ఎన్నో ఎమోషన్స్‌తో మెలిపెట్టేసే లవ్ స్టోరీస్ ని రూపొందించిన సంగతి తెలిసిందే. లవ్ లో ఉండే ఎమోషన్స్ ని అంత పెయిన్ ఫుల్ గా చూపించాడు అంటే శివకు కూడా గతంలో ఏదో లవ్ స్టోరీ ఉందని డౌట్లు అందరిలోనూ ఉన్నాయి. ఇక‌ తన రియల్ లైఫ్ లవ్ స్టోరీ ఒక సారి తెలుసుకుందాం. ఖుషి సినిమాకు సంబంధించిన ముచ్చట్లను పంచుకుంటూ శివా నిర్వాణ తన రియల్ లైఫ్ లో వైఫ్ తో మొదలైన ప్రేమ కథను గురించి చెప్పుకొచ్చాడు.

నాకు పెద్దగా లవ్ స్టోరీలంటూ ఏమీ లేవు.. వరుసగా లవ్ స్టోరీలు చేస్తుంటే నాకే 3 లవ్ స్టోరీలు ఎలా చేశానో అనిపిస్తుంది. మా ఆవిడ కూడా అప్పుడప్పుడు ఇంకా ఎన్నాళ్ళు ప్రేమ, పెళ్లి అని తీస్తూ ఉంటావు.. వేరే జానర్‌లో ఏదైనా కథను రాయచ్చుగా అంటుంది. నిజానికి నాది లవ్ స్టోరీ ఏం కాదు.. పెద్దలు కుదిరించిన సంబంధం. ఓ పెళ్లిలో అమ్మాయిని చూసిన మా అమ్మ, నాన్న ఆ అమ్మాయి నచ్చడంతో ఆ పెళ్లికి వచ్చిన అమ్మాయి వాళ్ళ‌ బాబాయ్‌తో పెళ్లి సంబంధం గురించి మాట్లాడేశారు. ఆ అమ్మాయి వివరాలు తెలుసుకొని వారంలోనే పెళ్లి చూపులు పెట్టేశారు. నిన్ను కోరి సినిమా వరకు పెళ్లి చేసుకోకూడదు డైరెక్షన్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా.. కానీ నిన్ను కోరి అయ్యేటప్పటికి చాలా టైం అయిపోయింది.

ఇప్పుడు ఫ్రెష్ గా ప్రేమించి పెళ్లి చేసుకోవడం కష్టం లేఅనుకున్నా. పెళ్లికి అప్పటికే ఆలస్యం కావడంతో నాకు ఫోటోలవి పంపిస్తే వంకలు పెడతానని అమ్మ చెప్పకుండా సడన్‌గా పెళ్లిచూపులు ఏర్పాటు చేసింది. ఇక పెళ్లిచూపుల్లో ఆ అమ్మాయి నేను తీసిన నిన్ను కోరి చాలా ఇష్టమంటు చెప్పుకొచ్చింది. మనం అక్కడ అయ్యాం. అలా నన్ను కోరి పెళ్లి చేసుకుంది. ఇప్పుడేమో అన్ని లవ్ స్టోరీలేనా వేరే సినిమాలు చేయొచ్చు క‌దా అంటుంది. నాకు ఇవే తీయాలని లేదు మాస్ అండ్ యాక్షన్ సినిమాలు కూడా తీయాలని ఆసక్తి ఉంది. కాకపోతే ఏ జానర్ లో తీసిన ఎమోషన్ ఉండాలని నాకు బలంగా అనిపిస్తుంది అంటు చెప్పుకొచ్చాడు డైరెక్టర్ శివ నిర్వాణ.