తెలుగు సినిమా ఇండస్ట్రీలో లెజెండ్ హీరోగా ఎదిగిన చిరంజీవి అంటే నచ్చని వారు ఉండరు. అందరి హీరోల అభిమానులకు చిరంజీవి అంటే చాలా ఇష్టమే. చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్గా ఎదిగాడు. ఇప్పటికీ 70 కి పైగా వయసు వస్తున్న కొద్ది ఇంకా సినిమాల్లో జోరు పెంచుతూ ముందుకు సాగుతున్నాడు. అలాంటి చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ష బావగారు బాగున్నారా “.
ఈ సినిమా విడుదలై ఇప్పటికీ 25 సంవత్సరాలు అవుతుంది. ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. నాగబాబుని హీరోగా నిలబెడదామని చిరంజీవి ట్రై చేస్తున్న రోజులవి. కానీ నాగబాబు అంతా కటౌట్ ఉన్న కానీ హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. దీంతో చిరంజీవి తన అంజనా పేరుతో ” అంజనా ప్రొడక్షన్స్” సంస్థను స్థాపించి నాగబాబుని నిర్మాతగా పరిచయం చేశాడు. అలా నాగబాబు నిర్మాణ సారథ్యంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ముగ్గురు మొనగాళ్లు, దృద్రవీణ, బావగారు బాగున్నారా, స్టాలిన్ వంటి చిత్రాలు వచ్చాయి.
1998లో వచ్చిన ఈ బావగారు బాగున్నారా చిత్రం మాత్రమే సూపర్ హిట్ అయింది. మిగతా సినిమాలు థియేటర్ల వద్ద బోల్తా పడ్డాయి. జయంత్. సి పరాంజీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్నారట. కానీ అప్పటికే పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉండడంతో చేయలేకపోయాడట. ఈ సినిమాలో రంభ, రచనను హీరోయిన్గా తీసుకున్నారు. 1998లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మొత్తం 86 కేంద్రాల్లో 50 రోజులు, 54 కేంద్రాల్లో 100 రోజులు ఆడి సూపర్ హిట్ గా నిలిచింది.