రోబోలన్నీ అమ్మాయిల పోలికలతో ఉండ‌టానికి.. రీజన్ ఏంటో తెలుసా..!!

మోడ్రన్ టెక్నాలజీ కొత్త ఆలోచనతో ముందుకు సాగుతుంది. అనేక రంగాల్లో ఏఐ ద్వారా రూపొందించిన రోబోలు అద్భుతాలు చేస్తున్నాయి. ప్రపంచంలోనే ఫస్ట్ అల్ట్రా రియలిస్టిక్ హ్యుమనాయిడ్ ఆర్టిస్ట్ రోబో పేరు ‘ఐడా’ అయితే.. మరో తొలి నర్సింగ్ అసిస్టెంట్ రోబో పేరు ‘గ్రేస్’. వీటితోపాటు సోఫియా, నాడిన్, మికా, డిస్టెమోనా వంటి రోబోస్ ఆ తర్వాత వరుసుగా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇప్పటి వరకు తయారుచేసిన ఈ రోబోలన్నింటిలో అత్యధిక అమ్మాయిలను పోలిన డిజైన్తో కూడినవే అధికంగా ఉన్నాయి.

వాటికి స్త్రీ లక్షణాలు మాత్రమే ఎందుకు ఇచ్చారు? మగ రోబోలు ఎందుకు తయారు చేయడం లేదు. అని విషయాలు ఇటీవల సోషల్ మీడియాలో చర్చకు వస్తున్నాయి. పురుషాధిక్య, పితృస్వామిక భావజాలం టెక్నాలజీ ను కనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. లింగ విభక్షలో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) వాయిస్ సిస్టం రోబోలకు స్త్రీ రూపం ఇస్తారని ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తుంది. సాధారణంగా డిజైనర్లు తనకు పోలిన లేదా తనకు నచ్చిన రోబోలను తయారు చేయడానికి మొగ్గు చూపుతారని చెబుతున్నారు. ఇప్పటివరకు వాటిని రూపొందించిన వారిలో ఎక్కువ స్త్రీలే కావడం వల్ల సహజంగానే స్త్రీ రూపం ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు.

అయితే నాడిన్ అనే ఆడ రోబో గురించి పరిశీలిస్తే గనుక దీనిని తయారు చేసింది ఒక మహిళ. ఆమె పేరు నాడియా మాగ్నెనాట్ థల్మాన్. తన ఇంట్రెస్ట్ కొద్దీ దీనికి స్త్రీ రూపం ఇచ్చారట. పైగా తనను తాను ఒక ‘రోబో సెల్ఫీ’గా భావిస్తున్నట్లు ఆమె గతంలో పేర్కొన్నారు.ఈ సమావేశంలో స్త్రీ రూపం కలిగిన హ్యుమనాయిడ్ రోబోలతోపాటు పురుష రూపం ఉన్న జెమినాయడ్ రోబోలను కూడా హాజరు పర్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇక్కడ లింగ వివక్షకు తావులేదని జెమినాయడ్ అనే మగ రోబో సృష్టికర్త హిరోషి ఇషిగురో పేర్కొన్నాడు.అయినప్పటికీ స్త్రీని ఒక మార్కెట్ వస్తువుగా, లైంగిక వస్తువుగా చూసే ధోరణి టెక్నాలజీ విషయంలోనూ కనిపిస్తోందనిపలువురు స్త్రీ వాదులు పేర్కొంటున్నారు.