బన్నీలో నాకు నచ్చింది అదే…శ్రీ రెడ్డి బోల్డ్ కామెంట్స్ విన్నారా..!

ఇప్పుడు ఏదో ఒక గొడవతో ఎవరో ఒకరిపై హాట్ కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో హైలెట్ గా నీలోడంలో శ్రీ రెడ్డికి బాగా అలవాటు అయిపోయింది. మామూలుగా శ్రీరెడ్డిని ఎవరూ పట్టించుకోరు.. అయితే సోషల్ మీడియాలు ఎప్పుడు ఎవరో ఒకరిపై అడ్డదిడ్డమైన కామెంట్లు చేస్తూ తాను లైవ్ లోనే ఉన్నానని చెప్పుతూ వస్తుంది. శ్రీరెడ్డి ఎప్పుడూ మెగా కుటుంబాన్ని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు, ఆయన స్థాపించిన జనసేన పార్టీనీ అయ‌న‌ అభిమానులను సైతం టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది.

అందుకే పవన్ అభిమానులు శ్రీ రెడ్డి పై ఎప్పుడు విరుచుకుపడుతూ ఉంటారు. ఇక ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడుగా ఎంపికైన విషయం అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో పుష్పరాజ్‌ పాత్ర గాను అల్లు అర్జున్ కు జాతీయస్థాయిలో ఉత్తమ నటుడుగా అవార్డు వచ్చింది. ఈ సమయంలోనే అల్లు అర్జున్ కు శ్రీ రెడ్డి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో హాట్ కామెంట్లు చేసింది.

 

కంగ్రాట్యులేషన్స్ అల్లు అర్జున్ విన్నింగ్ దీ బెస్ట్ యాక్టర్ ఫర్ నేషనల్ అవార్డు.. ఇదే సమయంలో బన్నీలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే మెగా అనే ముసుగులో లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడంటూ శ్రీరెడ్డి కామెంట్లు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తున్నాయి. అయితే ఇక్కడ మెగా అనే మూసుగు లేకుండా అనే పదం వాడటం ద్వారా శ్రీరెడ్డి మరోసారి మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తరపు హీరోలను వారి అభిమానులు కూడా మరోసారి గెలికిందని ఆ పోస్టుకు కామెంట్లు వస్తున్నాయి. దీంతో పవన్- చిరు అభిమానులు శ్రీ రెడ్డి పై మరోసారి సోషల్ మీడియాలో బూతులు వర్షం కురిపిస్తున్నారు.