కొత్తిమీర మన వంటలలో అత్యంత ప్రాచుర్యం పొందిన పదార్థాల్లో ఒకటి. కొత్తిమీర భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగిస్తారు. దీనిలోని అన్ని భాగాలు తినదగినవే. అయితే తాజా ఆకులు, ఎండిన గింజలు, మసాలాగా ఉపయోగిస్తారు. ఇది తాజా ఆకుపచ్చ రూపంలో లేదా ఎండిన గింజల రూపంలో వంటకాలు ఉపయోగిస్తూ ఉంటాము. వంటకాల్లో రుచి, సువాసన కోసం కొత్తిమీరపై ఆధారపడతారు. మూత్రపిండాలను శుభ్రపరచడంలో సహాయపడే కొత్తిమీర కషాయం.
కొత్తిమీర గింజలు ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు దీంతో ఉపశమనం లభిస్తుంది. మధుమేహం చికిత్సలో , నియంత్రించడంలో కొత్తిమీర సహాయ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇస్సులిన్ చర్యను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండడంలో మరింత సహాయపడుతుంది. అనేక సమస్యలకు కొత్తిమీర ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర రుచికి కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
ఇందులో ఉండే లక్షణాలు వల్ల ఎటువంటి సమస్య అయినా చిటికలో మాయమైపోతుంది. కొత్తిమీర గింజలు జీర్ణ క్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను మరింత శుభ్రంగా ఉంచుతాయి. క్యాల్షియం, విటమిన్ కె వంటి పోషకాలు కొత్తిమీరలో ఉంటాయి. రోగనిరోధక శక్తిని బలోపితం చేస్తుంది. శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి వేడిని తొలగిస్తుంది. కిడ్నీలోని వ్రత పదార్థాలను బయటకు పంపడంలో ఉపయోగపడుతుంది. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ క్యాలరీలు ఇందులో ఉంటాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోపాటు గుండె సమస్యలను కూడా అరికడుతుంది.