శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ఖుషి. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకోగా సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధం కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా ఒకవైపు భారీగానే జరుగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాను మీడియా మిత్రులు అలాగే కొంతమంది సినీ ప్రముఖుల కోసం హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో ప్రివ్యూ షో వేయగా.. ఈ సినిమా చూసినవారు ఏ విధంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు అన్నది ఇప్పుడు వైరల్ గా మారింది.
హిట్ కోసం అటు విజయ్ దేవరకొండ ఇటు సమంతా ఇద్దరు కూడా ఎంతో ఎదురు చూస్తున్న విషయం తెలిసింది మరి ఇద్దరికీ ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందించింది అనేది ఈ ప్రివ్యూ షో టాక్ ద్వారా ఇప్పుడు చూద్దాం.. ఈమధ్య కాలంలో వచ్చిన ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ ఇదేనని రొటీన్ కి చాలా భిన్నంగా ఈ చిత్రం ఉందని అలాగే ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయితే కచ్చితంగా వేరే లెవెల్ కి వెళుతుందని.. ముఖ్యంగా కలెక్షన్ల పరంగా నో డౌట్ అంటూ వారు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
ఈ సినిమాలో నటిస్తున్న సమంత, విజయ్ దేవరకొండ జంటను కొన్నేళ్ల వరకు గుర్తుపెట్టుకుంటామని, ఇద్దరు కూడా పోటీపడి మరీ నటించారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పబ్లిక్ నుండి కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఖచ్చితంగా వండర్స్ క్రియేట్ చేస్తుందని చెప్పాలి. ఇక చాలాకాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న వీరిద్దరికీ కూడా ఈ సినిమా ఒక మైల్ స్టోన్ లాగా మిగులుతుంది అని మీడియా మిత్రులు కూడా స్పష్టం చేస్తున్నారు.