కొత్త గర్ల్ ఫ్రెండ్‌తో అర్జున్ కపూర్.. ఆ హీరోయిన్‌ని వదిలేసినట్టేనా..?

గ‌తంలో బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ తనకంటే వయసులో పెద్దదైన మలైకా అరోరాతో ప్రేమలో ఉన్నాడు, వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాన్ని నిజమేనంటూ అర్జున్ కపూర్ ఓపెన్‌గానే ఒప్పుకున్నాడు.

ఇద్దరు వెకేషన్స్‌కి వెళ్లి ఎంజాయ్ చేసిన ఫొటోస్ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక ఇటీవల కాలంలో వీరి లవ్‌కి బ్రేక్‌ పడినట్టే కనిపిస్తుంది. మరోవైపు నటి కుషా క‌పిల్.. అర్జున్ కొత్త గర్ల్ ఫ్రెండ్ అనే టాక్ కూడా వినపడుతుంది. దీనిపై రియాక్ట్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించింది. కుషా ఇలాంటి చెత్త వార్తలు చదివిన ప్రతిసారి మళ్లీ నేను కొత్త ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వస్తుంది.

ప్రతిరోజు ఇలాంటివి చూసి విసుగు పుడుతుంది. మా మమ్మీ ఇలాంటి కామెంట్స్ చూడకుండా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ రాసుకొచ్చింది. కాగా గతంలో జారోవర్ సింగ్ అహ్లువాలియాను పెళ్లి చేసుకుని ఆరేళ్ల తరువాత అతనితో విడాకులు తీసుకుంది.