రాసిపెట్టుకోండంటూ.. అల్లు అర్జున్ విషయంలో వేణు స్వామి చెప్పిన జాతకం నిజమైందిగా..

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారి సంపాదించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డును దక్కించుకున్న అల్లు అర్జున్‌కు ప్రస్తుతం కోట్లాదిమంది అభిమానుల శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతుంది. ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇక తరచు సినీ సెలబ్రిటీస్.. రాజకీయ నాయకుల పై జాతకాలు చెప్పే వేణు స్వామి ఇటీవల అల్లు అర్జున్ జాతకం కూడా చెప్పాడు. ఆయన చెప్పిన జాత‌కం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. అయితే వేణు స్వామి మాట్లాడుతూ బన్నీకి అన్ని అనుకూలంగా జరుగుతాయి అని పుష్ప-2 రూ.2000 కోట్లు వసూలు రాబడుతుందని 6,7ఏళ్ళ‌వరకు ఆయనకు తిరుగు ఉండ‌దని పాజిటివ్ కామెంట్స్ చేశాడు.

ఈ జ్యోతిష్యుడు చెప్పినట్లే గురువారం జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నాడు అల్లు అర్జున్. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వేణు స్వామి చెప్పినదే అల్లు అర్జున్ జాతకంలో నిజమైంది గా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్స్.