ఒక్కోసారి కొన్ని విషయాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోవడం సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ చూసే ఉంటారు. కానీ వాటిలో కొన్ని ప్రత్యేక కారణాలు వల్ల పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోతాయి. కానీ ఓ పెంపుడు కుక్క వల్ల పీటల మీద పెళ్లి ఆగిపోయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. పెళ్లికి అన్ని రకాల ఏర్పాటలు చేసుకున్నా ఆ వరుడు కుక్క చేసిన పనికి పెళ్లి ఆగిపోయింది. అసలు ఈ కుక్క ఏం చేసింది.. ఎందుకు పెళ్లి అగిపోయిందా.. అనే విషయలు ఇప్పుడు చూద్దాం.
పెళ్లినేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకం. తమకు నచ్చిన ప్రదేశాల్లో తమకు నచ్చిన అమ్మాయి తో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దీనికోసం ఎంత ఖర్చైనా పెడుతున్నారు. అమెరికాలోని ఓ జంట కూడా తమ పెళ్లి కోసం డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేసుకున్నారు. అంగరంగ వైభోగంగా పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ పనుల్లో ఉండగానే వారి పెంపుడు కుక్క ఊహించని షాక్ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే… డొనాటో ఫ్రాట్టరోలిస్ అనే వ్యక్తికి మాగ్ధా మజ్రీస్ అనే యువతితో పెళ్లి కుదిరింది. ఇటలీలో వీరి పెళ్లి ప్లాన్ చేసుకున్నారు.
పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో పాటు పెళ్లికి హాజరైన బంధువులు, స్నేహితులు కూడా పాస్‌పోర్టులు , వీసాలు, టికెట్లతో సహా అన్ని సిద్ధం చేసుకున్నారు. కానీ పెళ్లి పనులు మిగిలి ఉండగా వరుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. తీరా వచ్చే సరికి పెంపుడు కుక్క అతడి పాస్ పోర్ట్‌లను నమిలేసింది. మరో 10 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు పాస్‌పోర్ట్ లేకపోతే ఏం చేయాలో అర్థం కాక స్థానిక అధికారుల దగ్గరికి పరుగులు పెట్టాడు.
ఆగస్ట్ 31న ఇటలీలో తన పెళ్లి జరుగుతుందని, ఇలాంటి సమయంలో తమ కుక్క చేసిన పనికి ఏం చేయాలో తెలియడం లేదని, ప్రత్యామ్నాయం చూపించాల్సిందిగా అభ్యర్థించాడు. లేదంటే తను లేకుండానే తనకు కాబోయే భార్యతో పాటు కుటుంబం, బంధువులు అందరూ ఇటలీకి వెళ్ళిపోతారని అధికారులకు మొరపెట్టుకున్నాడు. అయితే అదృష్టవశాత్తు అధికారులు వెంటనే స్పందించి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించారు. మరి ఆగస్టు 31న జరగాల్సిన వాళ్ల వివాహం జరుగుతుందా? అధికారులు చూపించిన ఆ ప్రత్యామ్నాయం ఏంటనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.