ఆర్‌ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేయబోతున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు హీరోగా రాబోతున్న ఈ సినిమాకి విజయేంద్రప్రదేశ్ కథను అందిస్తున్నాడు. ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్స్‌గా ఈ సినిమా రూపొందుతుందని రాజమౌళి తండ్రి ఇంతకుముందే తెలిపాడు. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఆ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటించబోతున్నారట. ఈ విషయం ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రాజమౌళి తండ్రి. ఇందుకోసం హాలీవుడ్ టాలెంట్ ఏజెన్సీ సిఏఏ కాస్టింగ్ చేయనుండగా.. రాజమౌళి ఇప్పటికే అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సమాచారం. హాలీవుడ్ పాపులర్ యాక్టర్ క్రిస్ హెమ్స్‌వర్త్ ఈ సినిమాలో నటించబోతున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.
కాగా విజయేంద్ర ప్రసాద్ చెప్పిన ఈ మాటలు కన్ఫామ్ చేసుకుంటున్నారు నేటిజన్స్. ఇప్పటికే రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు బాగా ఉన్నాయి. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి. మొత్తానికి ఈ పాన్ వరల్డ్ ఫిలిమ్ ప్రేక్షకుల అంచనాలను మించి ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది,