అన్న‌య్య మెగాస్టార్‌కు త‌మ్ముడు ప‌వ‌న్ స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్ ఇలా..!

మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనదైన స్టైల్ లో నటిస్తూనే కోట్లాదిమంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. 60 ఏళ్లు దాటినా ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా అదే క్రేజ్‌తో కొనసాగుతున్నాడు చిరంజీవి. ఇక ఈరోజు మెగాస్టార్ చిరంజీవి 68వ పుట్టినరోజు సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు జనసేన పార్టీ తరఫున తన స్టైల్ లో బర్త్డే విషెస్ తెలిపాడు.

పవన్ కళ్యాణ్ తన ఇన్‌స్టా వేదికగా అన్నయ్య చిరంజీవికి ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. మీ తమ్ముడులా పుట్టి మిమ్మల్ని అన్నయ్య అని పిలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.. ఆ భగవంతుడు నాకు ఇటువంటి అదృష్టాన్ని కలిగించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటు చెప్పుకొచ్చాడు. ఓ సన్నని వాగు అలా అలా ప్రవహిస్తూ మహానదిగా మారినట్లు మీ ప్రయాణం నాకు గోచరిస్తుందంటూ వివరించాడు.

మీరు కష్టపడి ఎదిగి మాకు ఎదగడానికి ఓ మార్గం చూపించారు.. మాకే కాదు లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, సేవాభావం, నీతి, నిజాయితీ, శ్రమ నాలాంటి ఎంతోమందికి ఆదర్శం అంటూ ఆ నోట్‌లో రాసుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి ఈ రేంజ్ లో బర్గ్‌డే విషెస్ ముందుగానే తెలపడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక‌ చాలామంది సినీ ప్రముఖులు అభిమానులు భారీ ఎత్తున చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.