ఆ స్టార్ హీరోయిన్‌కు తండ్రి నుంచి ఇబ్బందులు….!

చిత్ర పరిశ్రమలో చేరడాన్ని మొదట్లో తన తండ్రి ధర్మేంద్ర వ్యతిరేకించారని నటి ఈషొ డయోల్ వెల్లడించింది. రీసెంట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనుభవాలపై మాట్లాడుతూ… నాన్న పై నా ప్రేమను బహిరంగంగా వ్యక్తం చెయ్యకపోయినా బలమైన అనుబంధాన్ని కలిగివున్నాం. నాన్న చెప్పకుండానే అన్ని అర్థం చేసుకుంటాడు.

ఒక రకంగా ఆయన ఎక్స్ట్రీమ్‌లీ పొసెసివ్. కానీ నేను సినీ పరిశ్రమలోకి రావడానికి ఆయ‌న ఇష్టపడలేదు. వ్యక్తిగతంగా ఆయనకు నాపై ప్రేమ, ఇంకేదైనా కావచ్చు.. 18వ ఏట తాను పనిలోకి రావడం, ఆర్థిక స్వాతంత్రయాన్ని పొందడానికి కారణం కుటుంబంలోని మహిళలే కారణం అంటే వివ‌రించింది. ఈమె అమ్మ, అమ్మమ్మ, అత్తతో సహా ఇంట్లో బాలికలు కూడా శక్తివంతమైనవారే.

తన చుట్టూ ఉన్న మహిళలు దృఢంగా ఉంటేనే మన పనికి ఏ ఆటంకం ఉండ‌దు.. అందుకే నేను ఫ్యామిలీ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ల‌క్షంగా పెట్టుకున్నా.. నా పిల్లల నిర్ణయాల్లో జోక్యం చేసుకోకూడదని డెసిష‌న్‌ కూడా తీసుకున్న అంటూ కామెంట్స్ చేసింది.