నా చావు నాకు ముందే తెలుసు.. నటి గాయత్రి గుప్తా కామెంట్స్..!!

ఐస్ క్రీమ్ -2, ఫిదా ,కొబ్బరి మట్ట ఇలా ఎన్నో చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి గాయత్రి గుప్త ప్రతి ఒక్కరికి సుపరిచితమే..గతంలో ఇమే యాంకర్ గా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ తో పాటు బిగ్ బాస్ టీం పైన పలు లైంగిక ఆరోపణలను కూడా తెలియజేస్తూ నిరంతరం వార్తలలో నిలిచింది..ఏదైనా విషయాన్ని ముక్కుసూటిగా తెలియజేస్తూ ఉంటుంది గాయత్రి గుప్తా.. అయితే గత కొన్ని ఏళ్లుగా ఈమె ఒక వ్యాధితో బాధపడుతున్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.

Gayathri Gupta Height, Weight, Age, Boyfriend, Biography & More »  StarsUnfolded

గాయత్రి గుప్తా మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలోకి వెళ్తానంటే తన కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని పాతికేళ్ల వయసులో ఇంటి నుంచి బయటికి వచ్చేసాను.. తనకు మాంగ్లోసింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాధి ఉందని అది ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందో కూడా అర్థం కాలేదని తెలిపింది.. పదేళ్లపాటు బెడ్ రెస్ట్ తీసుకున్నాను ఇది డిప్రెషన్ వల్ల వచ్చే శారీరక వ్యాధి ఈ విషయం తనకు ఆరు నెలల క్రితమే తెలిసింది అంటూ తెలిపింది

చాలామంది డాక్టర్లు నేను ఎక్కువ కాలం బతకనని చెప్పారు..ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం బతకడం కష్టమని కూడా మూడేళ్ల క్రిందట వైద్యులు తెలిపారు.. తను ఊహ తెలిసినప్పటి నుంచి రాత్రిళ్ళు నిద్రపోలేదు డిప్రెషన్ వల్లే నాకు నిద్ర దూరం అయ్యింది.. నెలకు రెండు బయోలాజికల్ ఇంజక్షన్స్ తీసుకుంటాను ఇంజక్షన్ వేసుకోకపోతే అసలు కదలలేని కూడా అని తెలిపింది గాయత్రి గుప్తా. ఇలా జరిగినప్పుడు ప్రతిసారి కూడా తన గుండె వేగంగా కొట్టుకుంటుందని దాదాపుగా పదేళ్ల నుంచి తరచు ఇలాంటి పెయిన్ కిల్లర్స్ నే వాడుతున్నానని తెలిపింది.. వైద్యులు కూడా తను మరణిస్తానని చెప్పడంతో ఈ నొప్పి భరించడం కంటే అదే నయం అనుకున్నారని తెలిపింది. ఈ మధ్యనే కాస్త వీటన్నిటికీ దూరంగా నెమ్మదిగా బయటికి వస్తున్నానని బతకాలని ఆశ కలుగుతోందని తెలుపుతోంది గాయత్రి గుప్తా.