త‌న వార‌సుడిని నిల‌బెట్టేందుకు దిల్ రాజు క‌ష్టాలు చూశారా ?

సినిమాకు ఆస్కార్, నేషనల్ అవార్డ్ విన్నర్స్ పనిచేయబోతున్నారు. వారెవరు ఇప్పుడు చూద్దాం. రౌడీ బాయ్స్ మూవీతో దిల్ రాజ్ ఫ్యామిలీ నుంచి హీరోగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చాడు అశిష్.

ఎంతో మంది వారసులకు తొలి సినిమాతోనే హిట్ ఇచ్చిన దిల్ రాజ్ తన ఫ్యామిలీ హీరోకు మాత్రం ‘ రౌడీ బాయ్స్‌ ‘ తో సక్సెస్ అందించలేకపోయాడు. భారీ ప్రమోషన్స్, బడ్జెట్‌తో తెరకెక్కించినా కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం ‘ సెల్ఫిష్ ‘ పేరుతో ఆశిష్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ లవ్ స్టోరీ సెట్స్‌పై ఉండగానే ఆశిష్‌కి 3వ‌ సినిమాను సెట్ చేశాడు దిల్ రాజ్. సోమవారం పూజా కార్యక్రమంతో ఆశిష్ థర్డ్ మూవీ మొదలైంది. హారర్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాతో అరుణ్ డైరెక్టర్గా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా ఆటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ కెమెరామెన్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. దిల్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఆశిష్ హర్రర్ మూవీ షూటింగ్ మొదలు కాబోతున్నట్లు సమాచారం. కాగా ఆశిష్ హీరోగా నటిస్తున్న ‘ సెల్ఫిష్ ‘ సినిమాకు సుకుమార్ శిష్యుడు కాశి విశాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ఇనాయా సుల్తానా హీరోయిన్‌గా నడుస్తుంది. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది.