తాజాగా పవన్ ఫ్యాన్స్‌కి ఓ గుడ్ న్యూస్ వినిపించింది. దీంతో వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారా మరి పవన్ వారసుడిగా ఆఖీరా సినిమాల్లోకి అడుగుపెడుతున్నాడు అంటే ఫ్యాన్స్‌లో ఆమాత్రం హ్యాపీనెస్ ఉండడం కామన్. అంటే ఇప్పుడే సినిమా మొదలు పెడతాడని కాదు.. కానీ నటనలో నైపుణ్యం పెంచుకోవడానికి ఫిలిమ్స్ స్కూల్లో జాయిన్ అయ్యాడు ఆకీర. దానికే ఇంత ఆనందపడాలా అంటే కారణం ఉంది.
పవన్ వారసుడుగా ఆకిర నందన్ ఉన్నా తల్లి రేణు దేశాయ్ దగ్గర అకిరా నందన్ పెరుగుతున్నాడు. ఎన్నోసార్లు పవన్ ఫ్యాన్స్ రేణుని అడగగా ఆఖీరాకు సినిమాలంటే ఇష్టం ఉండదని.. ఇప్పుడు అప్పుడే సినిమాల్లోకి ఆఖీరా వచ్చే ఛాన్స్ లేదు అంటూ చెప్పుకొచ్చింది. మరోపక్క ఆకీర కూడా మ్యూజిక్, మార్షల్ ఆర్ట్స్, పియానో అంటూ తన టాలెంట్స్ అన్నిటిని చూపించాడు.. కానీ ఏ రోజు సినిమాపై ఆసక్తి చూపించినట్లు కనపడలేదు. దీంతో ఇక ఆఖీరా ఇండస్ట్రీలోకి రాడు అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిరాశపడ్డారు.
అయితే తాజాగా ఆఖీరా ఫిలిమ్స్ స్కూల్లో జాయిన్ అవ్వడం అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు హ్యాపీగా అనిపించింది. ప్రస్తుతం ఆకిరా(19) అమెరికాలోని ఫిలిం స్కూల్లో జాయిన్ అయ్యాడు. అంటే మరో రెండేళ్ల ఆకిర టాలీవుడ్ ఎంట్రీ కచ్చితంగా ఉంటుందనే తెలుస్తుంది. ఇక ఆఖరితోపాటు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మనవడు కార్తికేయ కూడా ఫిలిం స్కూల్లో జాయిన్ అయ్యాడు. నాలుగో జనరేషన్ బాయ్స్ తో కే ఆర్ ఆర్ అంటే.. నా మనవడు కార్తికేయ, పవన్ కళ్యాణ్ కుమారుడు ఆకీర నందన్ ఇద్దరు అమెరికాలోని ఫిలిం స్కూల్లో చేరారు అనివివరిస్తు ఓ ఫోటోను షేర్ చేశాడు.
ఈ ఫోటోలో ఒక పక్క అకిరా, ఇంకో పక్క కార్తికేయని పెట్టుకుని రాఘవేంద్రరావు నిలుచున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆకీర స్టైల్ చాలా బాగుందని, ఇందులో చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. మరి ఆకీర డెబ్యూ పవన్ ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి.