భారీ డిజాస్ట‌ర్‌… అప్పుడే ఓటీటీలోకి ‘ భోళాశంక‌ర్‌ ‘ … డేట్ ఇదే…!

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన సినిమా భోళాశంకర్ ఈ సినిమా ఆగస్ట్ 11 అని ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. రిలీజైన ఫ‌స్ట్ డే, మొదటి షో నుంచే నెగటివ్ టాప్ సంపాదించుకున్న ఈ మూవీ చిరంజీవి కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్ అని చెప్పాలి. దాదాపు రూ.110 కోట్ల భారీ బడ్జెట్ సినిమా రూ.30 కోట్ల కలెక్షన్లు మాత్రమే వసూలు చేసింది. మెగాస్టార్ హీరో కావడంతో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ రూ.82 కోట్ల వరకు చేసింది. రిలీజై కేవలం రూ.30 కోట్ల వసూళ్లను మాత్రమే కలెక్ట్‌ చేయడంతో ఈ సినిమాకు దాదాపు రూ.52 కోట్ల వరకు నష్టం రావచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమా రిలీజై 10 రోజుల్లో అవుతున్న కేవలం రూ.30 కోట్ల మాత్రమే వసూళ్లు సాధించడంతో ఈ సినిమా చాలా వరకు థియేటర్స్ వాళ్ళు తీసేసే అవకాశం ఉంది. థియేట్రిక‌ల్‌గా డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా త్వరలోనే ఓటిటి వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతోంది. ఇక చిరంజీవి సూపర్ హిట్ సినిమా వాల్తేరు వీరయ్య సినిమాను కూడా ఈ ఓటీపీ సంస్థ రూ.32 కోట్ల భారీ ఖర్చు చేసి హక్కులను దక్కించుకుంది. ఈ సినిమా హిట్ కావడంతో ఓటీపీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే విధంగా బోళాశంకర్ కూడా హిట్ అవుతుందనే ఉద్దేశంతో రిలీజ్ కు ముందే భారీ ధర చెల్లించి సినిమా రైట్స్ ను దక్కించుకుంది నెట్‌ఫ్టిక్స్‌ సంస్థ.

 

కానీ ఈ సినిమా ఫ్లాప్ కావడంతో దీని ప్రభావం ఓటిపి సంస్థ పై కూడా పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఏదైనా ఓ సినిమా సూపర్ హిట్ అయింది అంటే ఓటీటీ వారు ఫిక్స్ చేసుకున్న రిలీజ్ డేట్ ను కాస్త వాయిదా వేయాల్సి ఉంటుంది. అదే ప్లాప్ అయిందంటే కాస్త ముందుగానే రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా భోళాశంకర్ రిలీజ్‌కి ముందే.. రిలీజ్ అయిన 10 వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసుకోవాలని అనుకున్నారట. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ముందుగానే ఓటీటీలో రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారట. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 18 నుంచి ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఇంకా అఫీషియల్‌గా ప్రకటన రాలేదు.