టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఏడుస్తున్న వీడియోని షేర్ చేసి ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. అందరితో తనకు సంబంధించిన అన్ని విషయాలను పంచుకుంటాను… అదేవిధంగా తీవ్రమైన మానసిక బాధను అనుభవిస్తున్నాను మీరందరూ మంచి ఆరోగ్యంతో మంచి ఉత్సాహంతో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చింది.
అయితే ఇప్పుడు తాజాగా అనసూయ వీడియో పై హాట్ బ్యూటీ శ్రీరెడ్డి కూడా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. శ్రీరెడ్డి సోషల్ మీడియాలో.. ‘అరే ఎందుకురా అనసూయ ఆంటీని ఎలా ఏడిపిస్తున్నారు పాపం రా ఇంతకీ ఆమె ఎందుకు ఏడుస్తుందో చాలామందికి అర్థం కాలేదు’.. ‘సింపుల్గా చెప్పాలంటే ఆమె లోపల ఒకటి బయట ఒకటి కాకుండా తన మనసు ఏం చెప్తే అలా తన భావాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది అనుకుంటున్నాను’.
ఇక తను చెప్పేది నచ్చిని వాళ్ళు తనకి తప్పుగా కామెంట్ చేస్తున్నారు పాపం అవి తనకి బాగా బాధ కలిగించాయి.. ‘ఆ పోస్టులకు కూడా చాలామంది దరిద్రమైన కామెంట్లు కూడా పెడుతున్నారు తప్పురా అలా చేయకూడదు మంచిగా ఉందాం అంటూ శ్రీ రెడ్డి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ లో రాసుకొచ్చింది’. అంతేకాకుండా అనసూయ ఏడుస్తున్న వీడియోకు ఈ పోస్ట్ ను జత చేసింది. ఇక మరి శ్రీ రెడ్డి కామెంట్లపై అనసూయ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
అరేయ్, ఎందుకు రా అనసూయ ఆంటీ ని ఇలా ఏడిపిస్తున్నారు, పాపం రా 😥
ఇంతకి తను ఎందుకు ఏడుస్తుందో చాలా మందికి అర్ధం కాలేదు, సింపుల్ గా చెప్పాలంటే, తను లోపల ఒకటి, బయట ఒకటి కాకుండా, తన మనసు ఏం చెప్తే అలా, తన భావాలను, సోషల్ మీడియా లో పంచుకుంటున్నారు, తను చెప్పేది నచ్చని వాళ్ళు, తనకి… pic.twitter.com/5mZgFEoZ9i
— Sri Reddy (@MsSriReddy) August 19, 2023