30 ఏళ్ల తర్వాత రజనీ – అమితాబ్ మల్టీ స్టారర్.. డైరెక్టర్ ఎవరంటే..?

ఇటీవల రిలీజైన‌ జైలర్ సినిమాతో రజినీకాంత్ బ్లాక్ బాస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. నెలసన్‌ దిలీప్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ తమిళం, తెలుగులతో పాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజై కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా కలెక్షన్ల ఊచకోతతో రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌ని రీచ్ అవ్వబోతుంది. రజనీకాంత్ కెరీర్ లో ఇది 169వ సినిమా కాగా. నెక్స్ట్ మూవీ ఎలాంటి నేపథ్యంలో ఉండబోతుంది ఎవరితో తెరకెక్కిస్తున్నాడన్న ఆశ‌క్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది.

ఇక ర‌జినీ నెక్స్ట్ మూవీ కన్ఫర్మ్ అయింది. సూర్యతో జై భీమ్ తీసిన టీజే జ్ఞానవేలు దీన్ని దర్శకత్వం వహించబోతున్నాడు. సెప్టెంబర్ లో ఈ సినిమా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్‌ కూడా కీరోల్ ప్లే చేస్తున్నాడట. రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్గా నెగెటివ్ షేడ్స్‌లో ఉన్న క్యారెక్టర్ లో అమితాబ్ నటించబోతున్నట్లు తెలుస్తుంది.

1991లో వచ్చిన హమ్ మూవీలో వీరిద్దరూ కలిసిన నటించారు. మళ్లీ దాదాపు 30 ఏళ్ల తర్వాత రాబోయే త‌లైవ‌న్‌170వ‌ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించబోతున్నారు. ఓ సోషల్ మెసేజ్ తో కూడిన ఈ మూవీకి కూడా అనిరుధ్‌ సంగీతం అందించబోతున్నాడట. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందించబోతున్నారు. ఆధ్యాత్మిక యాత్ర కోసం హిమాలయాలకు వెళ్లిన రజనీకాంత్ అతి త్వరలో తిరిగి చెన్నై చేరుకుని ఈ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటాడ‌టా.