‘చంద్రముఖి’లో ర‌జ‌నీతో న‌టించిన ఈ చిన్నారి ఇప్పుడెంత అందంగా త‌యారైందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

చంద్రముఖి.. ఈ సినిమాను ప్రేక్ష‌కుల అంత త్వ‌ర‌గా మ‌ర్చిపోలేదు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న చిత్రాల్లో చంద్ర‌ముఖి ఒక‌టి. పి.వాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టించింది. జ్యోతిక‌, ప్ర‌భు, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. 2005లో విడుదలైన ఈ సినిమా అప్ప‌ట్లో ఓ సెన్సేష‌న్‌. ఇప్ప‌టికీ ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గలేదు.

త‌ర్వలోనే ఈ మూవీకి సీక్వెల్ గా `చంద్ర‌ముఖి 2` రాబోతోంది. లారెన్స్ హీరోగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌట్ టైటిల్ పాత్ర‌లో తెర‌కెక్కిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ లో రిలీజ్ కాబోతోంది. అయితే చంద్రముఖి సినిమాలో `అత్తింధోం..` పాట సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో రజనీకాంత్‌తో పాటు ఓ చిన్నారి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. అయితే ఆ చిన్నారి ఇప్పుడెంత అందంగా త‌యారేందో చూస్తే స్ట‌న్ అయిపోతారు.

ఆ పాప పేరు ప్రహర్షిత శ్రీనివాసన్‌. చిన్న‌త‌నంలో ఈమె చాలా సినిమాల్లో న‌టించింది. అలాగే సీరియ‌ల్స్ కూడా చేసింది. ఆ త‌ర్వాత వెండితెర‌కు దూర‌మైన ప్ర‌హ‌ర్షిత‌.. 2021లో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ప్రారంభించింది. గ‌త ఏడాది ఈమెకు ఒక పాప కూడా జ‌న్మించింది. న‌ట‌న‌కు దూర‌మైనా ప్ర‌హ‌ర్షిత‌.. సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. త‌ర‌చూ త‌న‌కు సంబంధించిన ఫోటోలను, వీడియోల‌ను పంచుకుంటూ ఉంటుంది. అన్న‌ట్లో దాదాపు 18 ఏళ్ల త‌ర్వాత ప్ర‌హ‌ర్షిత కోలీవుడ్ లో ఓ టీవీ సీరియ‌ల్ ద్వారా రీఎంట్రీ ఇవ్వ‌బోతోంది.

 

View this post on Instagram

 

A post shared by Praharshetha (@official_bommi)