ఎస్పి రాజశేఖర్ దర్శకత్వం వహించిన ‘ లోకల్ సారక్క ‘ సినిమా లో కొరియోగ్రాఫర్ దినేష్ హీరో గా, ఉపాసన హీరోయిన్ గా నటిస్తున్నారు. వరాహ ఫిల్మ్స్ పతాకం పై సంగీత దర్శకుడు వీ ఆర్ స్వామినాధన్ రాజేష్ ఈ సినిమా ని నిర్మించారు. లోకల్ సారక్క సినిమా లో యోగిబాబు, సింగంపులి, ఇమాన్ అన్నాచ్చి తదితరులు నటించారు. ఈ సినిమా ఇప్పటికే నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకొని తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
శనివారం ఉదయం ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేశారు. స్థానిక సాలిగ్రామం లోని ప్రసాద్ ఐమాక్స్ ల్యాబ్ లో లోకల్ సారక్క ట్రైలర్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు కమ్ మాజీ శాసనసభ్యుడు ఎస్వి శేఖర్, నటుడు కమ్ నిర్మాత కె. రాజన్, నటి వనిత విజయకుమార్, సౌదర పాండియన్, విజయ మురళి, సంగీత దర్శకుడు దిన లాంటి సినీ ప్రముఖులు చాలామంది హాజరయ్యారు. అయితే ఎస్వి శేఖర్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఎస్వి శేఖర్ మాట్లాడుతూ ‘ ఈ మధ్య ఎంటర్టైన్మెంట్ పేరు వస్తున్న సినిమా లు చాలా వరకూ ప్రేక్షకులకూ హాని కలిగిస్తున్నాయి. అయితే ఈ సినిమా టైటిల్ కాస్త హార్డ్ గా ఉంది. కానీ ఈ సినిమా లో మంచి కామెడీ తో పాటు ఒక మంచి సందేశం కూడా ఉంది. ఈ సినిమా టైటిల్ కోసం దర్శకనిర్మాతలు చాలా కష్టపడ్డారు. ఈ మధ్య నిర్మాత వైనాట్ శశికాంత్ న దెగ్గరకి వచ్చి ‘ టెస్ట్ ‘మూవీ చేస్తున్నాం. ఆ సినిమా లో మీరు హీరోయిన్ సిధార్ధ కూ తండ్రిగా నటించాలి అడిగారు. ఆ తరువాత కొన్ని రోజులకూ వచ్చి మీరు ప్రధాని మోడీ మద్దతుదారి కాబ్బటి సిధార్థ్ మీతో నటించను అని చెప్పారు.ఆ తరువాత ఫోన్ చేసి సినిమా స్టోరీ మారిందని చెప్పారు. అయిన వృత్తి వేరు రాజకీయాలు వేరు. ఇదంతా చూస్తుంటే సిధార్థ్ నాతో నటించడానికి బయపడుతున్నట్లు అనిపిస్తుంది. ‘ అని అన్నారు. ప్రస్తుతం ఎస్వి శేఖర్, సిధార్థ్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.