ట‌బు చీర ఇస్త్రీ చేసే పొజిషన్ నుంచి.. కొన్ని వందల కోట్ల అధిప‌తిగా ఎదిగిన స్టార్ డైరెక్టర్..!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ స్టేట‌స్‌ తెచ్చుకోవాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలా ఇండస్ట్రీలో అవకాశం కోసం ఎన్నో అవమానాలు, బాధలను ఎదుర్కొని స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వారిలో రోహిత్ శెట్టి ఒకడు. రోహిత్ శెట్టి మొదటి పారితోషకం రూ.35లు మాత్రమేన‌ట‌. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో రోహిత్ శెట్టి సీనియర్ స్టార్ హీరోయిన్ టబు చీరలను ఐరన్ చేసేవాడట. సినిమాలపై ఇష్టంతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోహిత్ తన 17 ఏళ్ల వయసులో ‘ పోల్ ఆర్ కంటే ‘ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించాడు.

ఈ సినిమా భారీ సూపర్ హిట్ అయింది. తర్వాత కొన్ని సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు వహించిన రోహిత్ అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ట్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల రోహిత్ శెట్టి డైరెక్షన్లో వచ్చిన సూర్యవంశం సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ సినిమాతో రోహిత్ శెట్టి భారీ పాపులారిటీ తెచ్చుకున్నాడు. అలా ఎన్నో కష్టాలు, అవమానాలను భరించి స్టార్ డైరెక్ట‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ శెట్టి ఆస్తులు విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు.

రోహిత్ శెట్టి ఎప్పుడు టైం దొరికిన ఏదో ఒక పనిలో మునిగిపోతూ ఉంటాడట. అలా ఎప్పుడు క‌ష్ట‌ప‌డే రోహిత్ శెట్టి సంవత్సర ఆదాయం దాదాపు రూ.35 నుంచి రూ.45 కోట్ల వరకు ఉంటుందట. రోహిత్ శెట్టి మొత్తం ఆస్తి విలువలు రూ.250 కోట్లు పై మాటే. స్టార్ హీరోయిన్ల చీరలు ఐరన్ చేసే పొజిషన్ నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న రోహిత్ శెట్టి ఒక్క సినిమాకు గాను రూ.25 కోట్లు ఛార్జ్ చేస్తాడ‌ట‌.