ఇటీవల కాలంలో సినీ ప్రేమికులంతా థియేటర్లో కంటే ఓటీటీలలో సినిమాలు చూసేందుకే ఆసక్తి చూపుతున్నారు. రిలీజైన సినిమాలు కూడా నెలలోపే ఓటీటీ వేదికలపై ప్రత్యక్షమవుతుండడంతో సినీ ప్రేక్షకులు ఎంచక్కా ఇంట్లోనే సినిమాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. తాజాగా మడక్ ఫిలిమ్స్ సంస్థ ఓటీటీలో అత్యధికంగా చూసిన ఇండియన్ సినిమాల లిస్ట్‌ను తయారు చేసింది. అందులో హాలీవుడ్ కాకుండా అత్యధిక సమయం వ్యూస్ సాధించిన ఇండియన్ మూవీస్ ఉన్నాయి.
ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల లిస్టు రిలీజ్ అయింది. మడక్ ఫిల్మ్స్ రిలీజ్ చేసిన లిస్ట్ ప్రకారం హిందీలో ఆర్ఆర్ఆర్ తొలి స్థానంలో ఉండగా మిమీ మూవీ 10వ స్థానాన్ని దక్కించుకుంది. సెకండ్ ప్లేస్ లో ఆలియాభట్ మూవీ గంగుబాయి కదియావాడి, థర్డ్ ప్లేస్‌లో చోర్ నికల్ కే బాగా ఉన్నాయి. ఆ తర్వాత వరుస స్థానాలను డార్లింగ్స్, మిన్నల్ మురళి, హసీన్ దిల్ రూబా, సూర్యవంశి, మిషన్ మజ్ను, భూల్ భూలయ్యా 2 సినిమాల నిలిచాయి.
రాజమౌళి డైరెక్షన్ వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి స్థానంలో నిలవడం టాలీవుడ్ సినిమాలకే గర్వకారణం అని చెప్పవచ్చు. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ దక్కించుకున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియాభట్ నటించారు. ఈ సినిమా ఆస్కార్ అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే.