సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఇప్పటివరకు తన కెరీర్లో కేవలం తెలుగు సినిమాలలోనే నటించిన మహేష్ బాబు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పక్క మాస్ కమర్షియల్ రోల్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు పాన్ వరల్డ్ మూవీలో నటించబోతున్నారు.
ముఖ్యంగా ఈ సినిమా హాలీవుడ్ స్థాయి దృష్టిని ఆకర్షించే విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ గా నటించబోతున్నట్లు మహేష్ బాబు తెలుస్తోంది. మహేష్ బాబు ఒకవైపు యాడ్ల లో నటిస్తూనే మరొకవైపు సినిమాలలో నటిస్తూ పలు రకాల స్టైలిష్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉన్నారు..
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై వయసుతోపాటు అందం కూడా పెరిగే హీరోలలో మహేష్ బాబుది మొదటి స్థానం.. మహేష్ బాబు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఇదంతా ఇలా ఉంటే తాజాగా మహేష్ బాబు ట్విట్టర్లో సరికొత్త లుక్స్ ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కర్లీ హెయిర్ స్టైల్ స్టైలిష్ బాడీ లాంగ్వేజ్ తో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు మహేష్ బాబు. బ్లాక్ కళ్ళజోడు పెట్టుకొని మహేష్ షేర్ చేసిన ఫోటోలు విపరీతంగా ఆకట్టుకోవడంతో పలువురు అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ తరహాలో స్టైలిష్ లుక్ లో కనిపించాలి అంటే కేవలం అది మహేష్ కి సాధ్యమవుతుందంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
BTS… 😁 pic.twitter.com/MICYoosxwi
— Mahesh Babu (@urstrulyMahesh) June 9, 2023