సిల్క్ స్మితకు చివరి వరకు తోడుగా ఉన్నది ఎవరో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి సిల్క్ స్మిత ఎంతటి పాపులారిటీ సంపాదించింది అంతే తక్కువ సమయంలోనే ఈమె ఫేడౌట్ అయ్యి మరణించడం జరిగింది. ఇప్పటికీ ఈమె మరణం ఒక మిస్టరీగానే ఉందని సినీ ప్రముఖులు అభిమానులు సైతం తెలియజేస్తూనే ఉంటారు. సిల్క్ స్మిత పేరు వింటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఆమె మరణించి ఇప్పటికీ కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఈమె పేరు నిరంతరం వార్తలలో వినిపిస్తూనే ఉంటుంది

Annapurna is the only person who is with Silk Smitha even if everyone  leaves her.. Who
ఇటీవల నాని నటించిన దసరా సినిమాలో సిల్క్ స్మిత పోస్టర్ ఉపయోగించడంతో మరొకసారి ఆమెకు సంబంధించిన విషయాలు వైరల్ గా మారుతున్నాయి. సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఆ తర్వాత సక్సెస్ సాధించుకుంది సిల్క్ స్మిత.. ఈమె మొదట మేకప్ ఆర్టిస్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి పలు స్పెషల్ సాంగులలో కూడా నటించే స్థాయికి ఎదిగింది.. ముఖ్యంగా సిల్క్ స్మిత డేట్ల కోసం స్టార్ హీరోలు దర్శకులు సైతం వెయిట్ చేసేవారట అంతటి రేంజ్ లో పాపులారిటీ సంపాదించింది సిల్క్ స్మిత.

silk smitha, दारुच्या नशेत संपलं अभिनेत्रीचं आयुष्य, रजनीकांत यांच्याशी  अफेअरच्या चर्चा; मृत्यूचं गूढ आजही कायम - silk smitha affair with superstar  rajinikanth her death still mystery - Maharashtra Times
సిల్క్ స్మిత చిన్న వయసు నుంచి కష్టాలను ఎదుర్కొని చివరి క్షణంలో కూడా ఈమెకు కష్టాలే వెంటపడ్డాయట.. చిన్న వయసులోనే పెళ్లి తర్వాత భర్త వేధింపులు అతని నుంచి విడిపోవడం అలా కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఒంటరిగా తన జీవితాన్ని మొదలుపెట్టింది. ఆ తరువాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలువురిని నమ్మి మోసపోయింది. అయితే చివరి వరకు సిల్క్ స్మితకు తోడుగా ఉన్నది కేవలం ఒక వ్యక్తి మాత్రమే నట.. ఆమె అన్నపూర్ణ.. సిల్క్ స్మితను అన్నపూర్ణ చిన్న వయసులోనే దత్తకు తీసుకున్నది. ఆమె సిల్క్ స్మితకు పెద్దమ్మ వరస అవుతుంది. సిల్క్ స్మిత సినిమాలపై ఇష్టం ఉండడంతో ఆమెను తీసుకొని గుంటూరు నుంచి చెన్నైకి వెళ్లి అక్కడ నటి ఛాయాదేవికి సిల్క్ స్మిత ను అసిస్టెంట్గా చేర్పించడం జరిగిందట. అలా నెమ్మదిగా అవకాశాల కోసం అన్నపూర్ణ స్టూడియోకు తీసుకువెళ్లగా ఆఫర్ రావడంతో ఆ తర్వాత సిల్క్ స్మిత ఆఫర్లు అందుకొని స్టార్ నటిగా పేరుపొందింది కానీ దురదృష్టవశాత్తు ఈమె ఆత్మహత్య చేసుకునే సమయంలో ఆమె పెద్ద మన తన సొంత ఊరికి పంపించినట్లు సమాచారం.