డైరెక్టర్ రాజమౌళి తెలుగు సినీ ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాతలను ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా చేశారు. RRR చిత్రంతో గ్లోబల్ డైరెక్టర్ గా కూడా పేరు సంపాదించారు రాజమౌళి. ఎన్నో అవార్డులను అరుదైన గౌరవాలను కూడా సంపాదించుకున్నారు. రాజమౌళిప్రముఖ మ్యాగజైన్ టైమ్ అత్యంత ప్రభావితమైన ప్రముఖుల లిస్టులో ఆయన స్థానాన్ని దక్కించుకోవడంతో రాజమౌళి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. టైం మ్యాగజైన్ ది మోస్ట్ ఇన్ఫినియన్స్ పీపుల్ ఆఫ్ 2023 ను ప్రకటించడం జరిగింది ఇందులో రాజమౌళికి స్థానం దక్కడంతో ఈ గౌరవం అందుకున్న ఏకైక ఇండియన్ ఫిలిం మేకర్ గా పలు రికార్డులను అందుకున్నారు.
రాజమౌళి పలు అంతర్జాతీయ అవార్డులను కూడా RRR చిత్రంతో అందుకున్నారు. రాజమౌళి న్యూ ఇయర్ ఫీలింగ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డును కూడా అందుకున్నారు. అలాగే RRR చిత్రంలోని నాటు నాటు పాటకు కూడా రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులను సైతం అందుకోవడం జరిగింది. అంతేకాకుండా గోల్డెన్ గ్లోబ్ ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇతర దేశాలలో కూడా రాజమౌళి సినిమాకు భారీ ఆదరణ దక్కింది. ఇక రాజమౌళితో సినిమాలు చేసేందుకు పలు హాలీవుడ్ టెక్నీషియన్స్ నటీనటులు సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి సమయంలో రాజమౌళి టైమ్స్ జాబితాలో చోటు చేసుకోవడంతో ఈ అవార్డులను అభిమానులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. చిత్ర ప్రముఖులు ఆయనకు పలువురు దర్శక నిర్మాతలు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా రూ 2000 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
Congratulations to the pride of Indian cinema, @SSRajamouli, the first Indian filmmaker to be named one of @TIME's 100 most influential people in the world. 🔥🔥#SSRajamouli #TIME100 #RRRMovie pic.twitter.com/TOrOJYdi7T
— DVV Entertainment (@DVVMovies) April 13, 2023