బాలీవుడ్లో అలనాటి హీరోలు ఎంతోమంది ఇప్పటికీ తన హవా కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి వారిలో అక్షయ్ కుమార్ కూడా ఒకరు. ఈ నటుడు ఒక చిత్రానికి దాదాపుగా రూ.35 కోట్ల రూపాయలు అందుకుంటున్నట్లు సమాచారం.అంతేకాకుండా సినిమాలలో లాభాలలో వాటా కూడా అందుకుంటున్నట్లు సమాచారం. ప్రతి సంవత్సరం నిజాయితీగా పన్ను చెల్లింపు చేసి హీరోగా ఎంత గౌరవం పొందారు అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ తాజాగా రూ.260 కొట్లు రూపాయలు పెట్టి ఒక ప్రైవేట్ జట్ ను సొంతం చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకని నటులలో అక్షయ్ కుమార్ కూడా ఒకరిని చెప్పవచ్చు.
ఇక ఒక ఏడాదికి కచ్చితంగా మూడు నాలుగు సినిమాలు విడుదల చేస్తూ బాగా సంపాదించిన నేపథ్యంలో ప్రైవేట్ జట్టును కొనుక్కునేందుకు అర్హుడు అనే విషయాన్ని అభిమానులు తెలియజేస్తూ ఉన్నారు. అక్షయ్ కుమార్ నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బాగానే కలెక్షన్లను రాబడుతున్నాయని చెప్పవచ్చు. దీంతో అభిమానులు సైతం అక్షయ్ కుమార్ దగ్గర ఎంతటి ఆస్తి ఉందో అంటూ పలు లెక్కలను సోషల్ మీడియాలో చూపించడం మొదలు పెడుతున్నారు. అయితే అక్షయ్ కుమార్ ఈ వార్తలను సైతం ఇటీవల ఖండించినట్లు కూడా తెలుస్తోంది.
ఒక పత్రిక కథనంలో వచ్చిన విషయంపై అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో స్పందిస్తూ ఈ కథనం తాలూకాను స్క్రీన్ షాట్ తీసి ఆ వెబ్సైట్ ని తిట్టారట అబద్దాలకోరు అబద్దాలకోరు ప్యాంటులో మంటలు ఇది మీ చిన్నతనంలో విన్నారా అంటూ తెలియజేశారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ కెరియర్ విషయానికి వస్తే ఈయన వయసు ఇప్పుడు 55 సంవత్సరాలు. తాజాగా రామ్ సేతు అని చిత్రంలో కనిపించబోతున్నారు. అయితే ఎట్టకేలకు తన దగ్గర ఎలాంటి జెట్ లేదని తెలియజేశారు.
Liar, Liar…pants on fire! Heard this in childhood? Well, some people have clearly not grown up, and I’m just not in a mood to let them get away with it. Write baseless lies about me, and I’ll call it out. Here, a Pants on Fire (POF) gem for you. 👇#POFbyAK pic.twitter.com/TMIEhdV3f6
— Akshay Kumar (@akshaykumar) October 16, 2022