బాలీవుడ్ తారలంతా డ్రగ్స్ తీసుకుంటారని బాంబు పేల్చిన రామ్ దేవ్..!!

డ్రగ్ మాఫియా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తోంది ఇది ఏ ఇండస్ట్రీలో అయినా బాగా వినిపిస్తున్నది.బాలీవుడ్లో డ్రగ్ మాఫియా గురించి హీరోయిన్ కంగాన రనౌత్ గతంలో ఆరోపణలు చేయడం జరిగింది. రాజకీయ నాయకులతో లింక్ అయ్యి బాలీవుడ్ లోని ఎంతో మంది స్టార్లు సైతం ఇలాంటి దందాలో పాల్గొంటున్నారని తెలియజేస్తూ ఉండేది. అయితే ఈ విషయం ఈమె కాకుండా చాలామంది విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారని పార్టీ పబ్బులలో ఇది కామన్ గా మారిపోయిందని చాలామంది అంగీకరించారు. ఇంతకుముందు కూడా ప్రముఖ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక డ్రగ్స్ దంతా ఉందని వార్తలు కూడా వినిపించాయి. ఇక ఇదంతా చూస్తే బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ చుట్టూ డ్రగ్స్ ఉచ్చు ఉండనే ఉంటోంది అని అర్థమవుతోంది.

Yoga Guru Baba Ramdev Statement Against Salman Khan And Shahrukh Khan For  Taking Drugs | नशा मुक्त भारत को लेकर मंच से जमकर बरसे बाबा रामदेव, बोले-  'सलमान खान लेते हैं ड्रग्स,
ఇప్పుడు తాజాగా ప్రముఖ యోగా గురువు దీనిపైన ఆరోపించడం జరిగింది. బాలీవుడ్లో స్టార్స్ డ్రగ్స్ తీసుకుంటున్నారని రామ్ దేవ్ బాబా ఆరోపించారు. తారలు డ్రగ్స్ సేవిస్తున్నారని యోగ గురు బాబా రాందేవ్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. మొరాదాబాద్ లో శనివారం జరిగిన ఆర్యవిర్ సదస్సులో బాబాదేవ్ మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడని వ్యాఖ్యానించారు. అమీర్ ఖాన్ గురించి అయితే తనకు తెలియదని.. షారుక్ ఖాన్ బిడ్డ డ్రగ్స్ తీసుకుంటుండగా పట్టుబడి జైల్లో ఉన్నారని.. దీంతో ఎంతోమంది నటీమణులు సైతం ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

 

మిగతా వారి గురించి దేవునికి మాత్రమే తెలుసు అంటూ రామ్ దేవ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు .సినీ పరిశ్రమ చుట్టూ డ్రగ్స్ ఉన్నాయి రాజకీయాలలో కూడా ఇవి చాలానే ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయని ఇలాంటి వాటికోసం ఉద్యమం చేపడుతామని రామ్ దేవ్ బాబా తెలిపారు. బాబాజీ వాక్యాలకు ఎవరు కౌంటర్ ఇస్తారో చూడాలి మరి.