మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ నటించిన చిత్రాలలో తిక్క సినిమా తన కెరియర్ లో భారీ డిజాస్టర్ అని చెప్పవచ్చు. అయితే ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ మాత్రం తరచు అందరినోళ్లల్లో నానుతూ ఉంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ బ్రెజిలియన్ మోడల్ లారిస్సా బొనేసి. ఆ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరిందని దీంతో డేటింగ్ లో ఉన్నారని వార్తలు కూడా గతంలో బాగా వినిపించాయి. ఇక అందుకు తగ్గట్టుగానే సాయిధరమ్ తేజ పైనా కూడా సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికరమైన పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది లారిస్సా బొనేసి.
తాజాగా వీరిద్దరూ మరొకసారి వార్తల్లో నిలవడం జరిగింది. సాయిధరమ్ తేజ్ బర్తడే సందర్భంగా ఈ ముద్దుగుమ్మ చేసిన ట్వీట్ అందుకు కారణమని చెప్పవచ్చు. నిన్నటి రోజున.. హ్యాపీ బర్తడే మై తేజ్ అంటూ లవ్ సింబల్ ని జత చేసింది లారిస్సా బొనేసి. దీనికి నన్ను నిరంతరం డిస్టర్బ్ చేసే వ్యక్తి అంటూ సాయిధరమ్ తేజ్ థాంక్స్ తెలియజేస్తూ లవ్ ఎమోజీలను షేర్ చేయడం జరిగింది. దీంతో పాటు ఆమెతో సరదాగా దిగిన ఒక ఫోటోని కూడా షేర్ చేశారు. ఇక ఈ ట్వీట్లు చూసిన అభిమానుల సైతం వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా అని అడుగుతున్నారు.
ఇక గత ఏడాది కూడా సాయి ధరంతేజ్ బర్తడే రోజున నేను ప్రేమలో ఉన్నాను అంటూ లారిస్సా బొనేసి ఒక ట్వీట్ చేసీ సరికొత్త చర్చకు దారితీసింది.వారు ప్రేమలో ఉన్నారని రూమర్ ఒక్కసారిగా వైరల్ కావడం జరిగింది. ఇక గత ఏడాది రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు కూడా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ తేజు త్వరగా కోలుకోవాలని నీ నవ్వు మళ్లీ చూడాలని ఎదురుచూస్తున్నానంటూ రాసుకుంది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఒక ట్వీట్ కాస్తా వైరల్ గా మారుతోంది.
Hahahaha forever and always ! ♥️♥️♥️ https://t.co/136hB5m0TV
— Larissa Bonesi (@larissabonesi) October 15, 2022
Happy Birthday to my Teju @IamSaiDharamTej ♥️🎂🥳
— Larissa Bonesi (@larissabonesi) October 15, 2022