బిగ్ బి అమితాబచ్చన్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట హీరోగా అమితాబచ్చన్ ని పనికిరారని ఎంతోమంది హేళన చేశారు. అతని హైట్ ను చూసి నువ్వు హీరోవా అంటూ ఎంతో మంది ఎన్నో రకాలుగా అమితాబచ్చన్ ని అవమానించారు. అయినా సరే ఎక్కడ అవమానించబడ్డాడో అక్కడే ప్రశంశాలు అందుకొని స్టార్ హీరోగా ఎదిగాడు.. అలాగే భారతీయ సినిమాకి సూపర్ స్టార్ గా నిలిచారు అమితాబచ్చన్. నేడు అమితాబచ్చన్ పుట్టినరోజు. ఈ రోజున 80 వ వసంతంలోకి అడుగుపెట్టారు.
అమితాబచ్చన్ పనికిరారు అన్న వారి చేత యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు పొందడమే కాకుండా భారతీయ సినిమాల ఎన్నో మరుపురాని ఎవరు గ్రీన్ సినిమాలను అందించారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అమితాబచ్చన్ సూపర్ స్టార్ గా అందరీ చేత అనిపించుకుంటూ ఉన్నారు. సౌత్ హిందుస్థానితో ఉత్తమ నూతన నటుడుగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.
ఇక టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తున్న ప్రాజెక్ట్ -k చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇక ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్గా దీపికా పడుకొనే, దిశాపటాన్ని నటిస్తున్నది.
అక్టోబర్ 11వ తేదీన అమితాబచ్చన్ పుట్టినరోజు పురస్కరించుకొని ప్రాజెక్ట్ -k సినిమాకు సంబంధించి ప్రత్యేకమైన పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. పిడికిలి బిగించి కనిపిస్తున్న ఒక చెయ్యిని మాత్రమే పోస్ట్ ర్ లో విడుదల చేశారు. అలాగే “లెజెండ్ ఆర్ ఇమ్మోర్టల్” అంటూ అమితాబచ్చన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా 5 దశాబ్దాలకు పైగా అలరించిన పవర్ హౌస్ మీరు ఈసారి ఆవిష్కరించిన కొత్త అవతారాన్ని ప్రపంచానికి పరిచయం చేయకుండా వేచి ఉండలేం. ఇది మీ 80వ పుట్టినరోజు ఇలా మరెన్నో జరుపుకోవాలని అమితాబచ్చన్ పైన తనముకున్న ప్రేమని ప్రదర్శించారు.
A powerhouse that has entertained for more than 5 decades! Can't wait to show the world the new avatar you've unleashed this time. Here's to the 80th & many more! May the force be with you always & you're the force behind us @SrBachchan sir – Team #ProjectK pic.twitter.com/4GDAWQAign
— BA Raju's Team (@baraju_SuperHit) October 11, 2022