టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న సమంత విడాకుల తరువాత నుండి వేసే ప్రతి అడుగు ఆచి తూచి ఆలోచించి వేస్తుంది. తప్పో ఒప్పో ..జరిగింది జరిగిపోయింది. ఇక నుండి అయిన తన జీవితం పై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ కెరీర్ లో ఎలా ముందుకు వెళ్ళాలి ఎలాంటి రోల్స్ చేయలి అని పక్కా ప్లాన్ వేసుకుంటుదట సమంత. మనకు తెలిసిందే ప్రస్తుతం సమంత చేతిలో అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి.
ఇక ఆమె నటించిన సినిమా యశోద..రిలీజ్ కు సిద్ధమౌతుంది. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన ఈ సినిమా ను ఆగస్ట్ 12న రిలీజ్ కానుందంటూ మేకర్స్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఎందుకంటే .. అదే రోజున అక్కినేని హీరోలైన నాగ చైతన్య, అఖిల్ సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌తో కలిసి సమంత మాజీ భర్త అక్కినేని నాగ చైతన్య ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లాల్ సింగ్ చద్దా గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 11న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక మరో వైపు అఖిల్ అక్కినేని హీరోగా చేసిన ఏజెంట్ మూవీ ఆగస్ట్ 12న విడుదలవుతుంది. అసలే బాక్స్ ఆఫిస్ వద్ద అన్నదమ్ములు టఫ్ ఫైట్ ఇస్తున్నారు అనుకుంటున్న తరుణంలో మధ్యలోకి సమంత నేనున్నాను అంటూ యశోద సినిమాను ఆగస్ట్ 12న రిలీజ్ చేయడామికి సిద్ధపడింది. ఇక సినీ ఇండస్ట్రీ మొత్తం అక్కినేని కొడుకులు.. మాజీ కోడలు, గురించే మాట్లాడుకుంటుండగా.. మధ్యలోకి మెగాస్టార్ ఎంటర్ అయ్యాడు. ఆగస్ట్ 12న మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటించిన చిత్రం గాడ్ ఫాదర్ సినిమాను కూడా మేకర్స్ విడుదల చేయాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో సమంత నటించిన యశోద ఆ డేట్ నుండి తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. అఖిల్ కూడా..ఇంకా ముందుగానే సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. కానీ, నాగచైతన్య లాల్ సింగ్ చద్దా వాళ్లు మాత్రం వెనక్కి తగ్గడానికి ఇంట్రెస్ట్ చూయించట్లేదు . ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ పోన్ చేసుకున్న ఈ సినిమాను మూడొసారి వాయిదా వేసే ప్రసక్తే లేదంటూ తెలుపుతున్నారట. మరి బాక్స్ ఆఫిస్ వద్ద చిరంజీవిని అడ్డుకునే దమ్ము చైతన్య కు ఉందా లేదా అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే..!