సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సెంటిమెంట్లు ఉంటాయి. సినిమా విడుదల విషయంలో లేదా.. రిలీజ్ డేట్లు.. ప్రారంభోత్సవాల విషయంలో కానీ, ఆర్టిస్టుల విషయంలో కాని.. దర్శక, నిర్మాతలు, హీరోలు ఎన్నో సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు హీరోలు టైటిల్స్ విషయంలో సెంటిమెంట్లను పాటిస్తూ ఉంటారు. సీనియర్ నటుడు బాలకృష్ణ తన సినిమాల షూటింగ్ ప్రారంభోత్సవం రోజు నుంచి రిలీజ్ రోజు వరకు ప్రతిది ముహూర్తం పెట్టుకుని దాని ప్రకారమే ఫాలో అవుతూ ఉంటారు.
ఇక ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్‌తో పని చేస్తే.. ఆ తర్వాత ఆ హీరోయిన్‌కు కెరీర్ పరంగా అన్నీ కష్టాలే అన్న సెటైర్ ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తే తర్వాత రెండు సినిమాలు ఫ్లాప్ అవుతాయి అనే టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది. రాజమౌళి ఏ హీరోతో చేసినా అతడికి కెరీర్ బ్లాక్‌బస్టర్ ఇస్తాడు. ఆ వెంటనే ఆ హీరో సినిమా డిజాస్టర్ అవుతుంది. ఈ సెంటిమెంట్ గత 15 ఏళ్లుగా వెంటాడుతూనే ఉంది.
ఇలాగే ఓ దర్శకుడి దర్శకత్వంలో ఏ హీరోయిన్ అయితే నటిస్తుందో.. ఆ తర్వాత ఆమె కెరీర్ మొత్తం నాశనం అవ్వాల్సిందే అట. ఇప్పుడు ఈ సెంటిమెంట్ బాగా వైరల్ అవుతోందని.. ఇండస్ట్రీ అంతా ఇప్పుడు కోడై కూస్తోంది. సదరు డైరెక్టర్ ఇప్పుడు సౌత్ ఇండియాలోనే స్టార్ డైరెక్టర్‌గా ఉన్నాడు. ఆయన సినిమా చేశాడంటే చాలు సూపర్ హిట్టే..!
అయితే ఆయన దర్శకత్వంలో నటించిన హీరోయిన్లకు ఆ తర్వాత కెరీర్ ఉండట్లేదట. ఇలియాన , శ్రీయా లాంటి వాళ్లు ఆయన చేతిలో పడ్డాకే కెరీర్ పరంగా డౌన్ అయిపోయారు. వీరిద్దరే కాదు.. మరి కొందరు హీరోయిన్లది ఇదే పరిస్థితి. అయితే వీరిలో శ్రీయ ఒక్కటే పెళ్లయ్యాక కూడా కాస్త క్యారెక్టర్ ఆర్టిస్టుగా నిలదొక్కుకుంటున్నారు. ఏదేమైనా సదరు స్టార్ డైరెక్టర్‌కు ఇప్పుడు ఈ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది.