శివ కార్తీకేయ‌న్ ఆస్తులు చూస్తే క‌ళ్లు జిగేలే… :

కోలీవుడ్ క్రేజీ హీరో శివ‌కార్తీకేయ‌ర్ అటు కోలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ మోస్ట్ హ్యాండ్‌స‌మ్ హీరోగా గుర్తింపు పొందాడు. శివ‌కార్తీకేయ‌న్ ఎంచుకుంటోన్న క‌థ‌లే ఆయ‌న‌కు యూత్‌లో విప‌రీత‌మైన క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి. కోలీవుడ్ యూత్ మాత్ర‌మే కాకుండా.. టాలీవుడ్ యూత్ కూడా శివ‌కార్తీకేయ‌న్ స్టైల్‌కు ఫిదా అవుతున్నారంటే అత‌డి ఛ‌రిష్మా ఏంటో అర్థ‌మ‌వుతోంది. శివ కార్తీకేయ‌న్ మ‌ల్టీస్టార‌ర్.. ఓ ఆల్‌రౌండ‌ర్‌. అత‌డు ఓ హీరో, గాయ‌కుడు, ర‌చ‌యిత‌.. సింగ‌ర్ ఇలా ఎన్నో రంగాల్లో గొప్ప టాలెంట్ అత‌డిలో దాగి ఉంది.

శివ‌కార్తీకేయ‌న్ 1985 ఫిబ్ర‌వరి 17న త‌మిళ‌నాడులోని సింగంపునారి అనే గ్రామంలో జ‌న్మించాడు. తమిళనాడులో క్యాంపెయిన్ అనే కాలేజీ లో పూర్తి చేశాడు. శివ కార్తీకేయ‌న్ చ‌దువుకునే రోజుల్లోనే టీవీ షోల్లో పాల్గొనేవాడు. శివ తండ్రి జీ దాస్‌. జైలు సూప‌రిండెంట్‌గా ప‌నిచేయ‌గా.. త‌ల్లి పేరు రాజీ దాస్‌. శివ కార్తీకేయ‌న్ ఆగ‌స్టు 27, 2010లో ఆర్తీ దాస్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ దంప‌తుల‌కు 2013లో ఓ పాప జ‌న్మించింది. ఈ పాప పేరు ఆరాధన.

శివ మిమిక్రీ ఆర్టిస్ట్‌గా త‌న కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ త‌ర్వాత ప‌లు టెలివిజ‌న్ ఛానెల్స్‌లో కొన్ని షోలు చేశాడు. ఇలా షోలు చేసుకుంటూ షార్ట్ ఫిలింస్‌లో న‌టించాడు. అవి స‌క్సెస్ అయ్యాయి. శివ మొద‌టిసారిగా మెరీనా సినిమాతో త‌న కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ త‌ర్వాత ఐశ్వ‌ర్య – ధ‌నుష్ క‌లిసి చేసిన 3 సినిమాలో మ‌నోడికి ఛాన్స్ వ‌చ్చింది. సినిమా సినిమాకు యూత్‌లో త‌న స్టైల్‌తో క్రేజ్ సొంతం చేసుకున్న శివ‌కు రెమ్యున‌రేష‌న్ కూడా అలాగే పెరిగిపోతోంది. ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు రు. 20 కోట్ల పైనే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు.

చాలా త‌క్కువ టైంలోనే బాగా ఆస్తులు కూడ‌బెట్టుకున్న శివ కార్తీకేయ‌న్ మొత్తం ఆస్తి రు. 200 కోట్ల పైనే ఉంటుంద‌ట‌. చెన్నైలో విలాస‌వంత‌మైన రెండు ల‌గ్జ‌రీ హౌస్‌లు ఉన్నాయి. వీటి విలువే రు. 20 కోట్ల పైన ఉంటుంది. ఇక శివ‌కార్తీకేయ‌న్ ద‌గ్గ‌ర మొత్తం 7 కార్లు ఉన్నాయి. ఈ కార్ల ఖ‌రీదే రు. 6 కోట్ల పైన ఉంటుంద‌ట‌