ఆ హీరోయిన్ నా సినిమాలో వద్దు అంటున్న నాని..అసలు ఏమైందంటే..?

ఓ ముగ్గు బాగా రావలన్నా చుడటానికి అట్రాక్షన్ గా ఉండాలి అన్నా ఆ ముగ్గులో అన్ని రంగులు కలగలిసి ఉండాలి. అప్పుడే అందరికి నచ్చుతుంది. అలాగే ఓ సినిమా అంటే నవరసాలు కలిసి ఉండాలి. కేవలం ట్రాజడీ సీన్స్ ఒక్కటే ఉన్నా..లేక యాక్షన్ సీన్స్ మాత్రమే ఉన్నా .. అందరి జనాలకు నచ్చవు. అందుకే కొందరు డైరెక్టర్లు వాళ్ల సినిమాలో అన్ని ఎమోషన్స్ ని సమానంగా పెట్టడానికి ట్రై చేస్తారు. కానీ, ఈ మధ్య వస్తున్న సినిమాలో ఎక్కువ మంది డైరెక్టర్లు రోమాంటిక్ సీన్స్ ని చిత్రీకరించడానికే ఇంట్రెస్ట్ చూయిస్తున్నట్లు ఉన్నారు.

అది ఏలాంటి సినిమా అయినా సరే మీరు గమనించండి అవసరం లేకపోయినా..అలాంటి సీన్స్ ను ఎక్కడో ఓ చోట యాడ్ చేస్తున్నారు. అవి రొమాంటిక్ సీన్స్ అయితే పర్లేదు కానీ వల్గర్ సీన్స్ అవుతున్నాయి..మరీ రోతగా చూయిస్తున్నారు. ఇక అలాంటి సీన్ లో 5 నిమిషాలు నటించిన లక్షలకు లక్షలు రెమ్యునరేషన్ అడుగుతున్నారు స్టార్ ముద్దుగుమ్మలు. అయితే ఈ లిస్ట్ లోకి చేరిపోయింది సోనాల్ చౌహన్.

సోనాల్ చౌహన్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. బాలకృష్ణ సరసన ‘లెజెండ్‌’, ‘రూలర్‌’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన ఈ అమ్మడు ప్రస్తుతం ‘ఎఫ్‌3’ సినిమాలో నటిస్తుంది. అయితే తాజాగా అమ్మడుకి ఓ బంపర్ ఆఫర్ వచ్చిన్నట్లు తెలుస్తుంది. శ్యాం సింగ రాయ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాని ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే సింగరేణి కోల్‌బెల్ట్ బ్యాక్‌డ్రాప్‌లో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడితో దసరా అనే సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరొ ముద్దుగుమ్మ సోనాల్ చౌహన్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సోనాల్ చౌహన్ ను మేకర్స్ ఫిక్స్ చేసిన్నట్లు సినీ వర్గాలల్లో టాక్ వినిపిస్తుంది. అయితే డైరెక్టర్ ఈ సినిమాలో లవ్ ట్రాక్ కూడా నడిపించారని..ఈ క్రమంలోనే రెండు మూడు చోట్ల రొమాంటిక్ సీన్స్ ఉంటాయని. ఇక అలాంటి సీన్స్ లో నటించడానికి అమ్మడు భారీ రెమ్యూనరేషన్ అడిగిన్నట్లు మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నాని కూడా అంత డిమాండ్ చేసే వాళ్లను బ్రతిమిలాడద్దు..వదిలేయ్యండి. వేరే హీరోయిన్ ట్రై చేద్దాం అంటూ డైరెక్టర్ కు చెప్పారట . దీంతో మెకర్స్ అమ్మడు ప్లేస్ లోకి మెహ్రీన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. తెర పై నాని మెహ్రీన్ జంటకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి. మెహ్రీన్ కి ఫస్ట్ హిట్ సినిమా ఇచ్చిందే నాని కదా..దీంతో అమ్మడు అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. మరి మెహ్రీన్ నాని తో అలాంటి సీన్స్ కు ఒప్పుకుంటుందా..లేదా అనేది చూడాలి..?