మాళవికా మోహనన్.. అమ్మడు పేరు ని ఎలా మర్చిపోతాం. తన పేరుని జనాలు మరచిపోనీకుండా ..ఎప్పటికప్పుడు తన హాట్ అందాలను చూపించి చూపించకుండా చూపిస్తూనే అన్ని కవర్ చేస్తుంది ఈ మాలీవుడ్ బ్యూటి. నటించింది కొన్ని సినిమాలో నే అయినా కావాల్సినంత పాపులారిటినీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఎవరు ఏమనుకున్నా డోంట్ కేర్ అంటూ.. తనకు నచ్చిన పనులను నచ్చిన్నట్లు చేసేస్తుంది. ఈ విషయంలో మాలవికా మొహనన్ రూటే వేరు.
తెలుగులో ఇంకా అరంగేట్రం చేయలేదు కానీ.. డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ ఈ చిన్నది పరిచయమే. సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘పేటా’, దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలలో నటించిన మాళవికా.. మాస్టర్ సినిమాలో అదిరిపోయే నటనతో గుర్తింపు తెచ్చుకుంది. మలయాళ, తమిళ, హిందీ, కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్న మాలీవుడ్ అమ్మడు మాళవికా మోహనన్ నటించిన ధనుష్ మారన్ విడుదలకి సిద్ధంగా ఉండగా..చిరంజీవి గాడ్ పాధర్ సినిమాలో కూడా అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. మాలవికా సోషల్ మీడియాలో యమా యాక్టివ్ అనే సంగతి అందరికీ తెలిసిందే.
రీసెంట్గా ఈ అమ్మడు ఓ వీడియో పోస్ట్ చేస్తూ..అందరిని ఆశ్చర్యపరించింది. ఆమెకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అది ఎవరో మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే.. ఈ వీడియోకు పది లక్షల వ్యూస్ ఖచ్చితంగా రావాలంటూ ఓ ఖతర్నాక్ కండీషన్ పెట్టింది మాలవికా. అంతేనా ఆమె ఓ వీడియో లో మాట్లాడుతూ ..తన బాయ్ ఫ్రెండ్ తోనే మాట్లాడుతున్నట్లు మాట్లాడి..ఐ లవ్ యూ చెప్పి తికమక పెట్టి కన్ ఫ్యూజ్ చేసింది. అయితే కొందరికి పక్క వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆతృత ఉంటుందిగా..అలా చాలామంది ఆమె వీడియోని వైరల్ చేసారు.
అయితే మాళవిక అందరికి తిక్క కుదిరేలా చేసింది. వేలంటైన్ డే సందర్భంగా ఆమె అసలు నిజాని బయట పెట్టేసింది. ఆమె బాయ్ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చిన ది ఎవరో కాదు అసలు అది వ్యక్తి కాదు..ఓ కారు. స్కోడా స్లావియా అనే కారు యాడ్‌ను ఆమె పోస్ట్ చేసింది. ఇదే తాను చెప్పాలనుకున్న సీక్రెట్ అంటూ చెప్పింది. అయితే దీనిపై నెటిజన్స్ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. కొందరైతే బూతు పదాలను వాడుతూ..ఆకాశం చూపిస్తూ నేల నాకించేసావు గా మాళవికా అంటూ తిట్టిపోస్తున్నారు. ఇలా ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకోవడం మంచి పద్ధతి కాదు అంటూ ఇంకోసారి ఇలా చేయకు అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు.