రాజకీయాల కారణంగా మూడేళ్ల పాటు సినిమాలకు దూరమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మళ్లీ `వకీల్ సాబ్` సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే కరోనా వలన ఈ చిత్రాన్ని ఎక్కువ రోజులు థియేటర్ లో ప్రదర్శించలేకపోయారు
ఇదిలా ఉంటే.. తాజాగా వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్‌కి క్రిస్మస్ పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ సూపర్ గిఫ్ట్ పంపి సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ గిఫ్ట్‌ను ఓపెన్ చేసిన వీడియోను వేణు శ్రీరాం భార్య గాయత్రి శ్రీరాం సోషల్ మీడియాలో షేర్ చేసి.. పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. దీంతో గాయత్రి శ్రీరామ్ షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
కాగా, పవన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో `భీమ్లా నాయక్` సినిమా చేస్తున్నాడు. ఇందులో రానా కీలక పాత్ర పోషిస్తుండగా నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనావాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న విడుదల కానుంది.
అలాగే పవన్ మరోవైపు క్రిష్ దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తైన వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయాల్సి ఉంది. ఇక మరిన్ని ప్రాజెక్ట్స్ సైతం పవన్ చేతిలో ఉన్నాయి.
FROM OUR OWN VAKEELSAAB⚡ @PawanKalyan garu. THANK YOU SIR FOR SENDING US THIS LOVELY CHRISTMAS PRESENT ❤️. MERRY CHRISTMAS.🎉.#PSPK #ChristmasEve pic.twitter.com/Q1xRLPODp3
— Gayathri Sriram (@GAYATHRIGSAK) December 23, 2021