బ‌న్నీ భార్య‌పై స‌మంత `హాట్` కామెంట్..ఏకేస్తున్న ఫ్యాన్స్‌!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినిమాలు చేయ‌క‌పోయినా సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ హీరోయిన్‌కు సమానమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది స్నేహా. బన్నీ సినిమా విశేషాలతో పాటు, కుటుంబానికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం స్నేహకు అలవాటు.

ఈ నేప‌థ్యంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహా రెడ్డి ఫాలోవ‌ర్స్ సంఖ్య ఏకంగా ఆరు మిలియ‌న్లు దాటేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా స్నేహరెడ్డి కొన్ని ఫోటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. అందులో స్నేహా మల్హోత్ర డిజైన్ చేసిన నలుపు రంగు చీరను ధ‌రించి అందంగా మెరిసిపోతోంది. ఈ ఫొటోల‌పై నెటిజ‌న్లు మ‌రియు ప‌లువురు సెల‌బ్రెటీలు సూప‌ర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఈ క్ర‌మంలోనే స‌మంత `హాట్‌` అంటూ కామెంట్ అగ్గి రాజేసింది. సాధార‌ణంగా హీరోయిన్‌ ఫొటో కింద ఇలాంటి కామెంట్‌ చేస్తే ఓకే. కానీ ఓ స్టార్‌ హీరో భార్య ఫొటోకు ఇలాంటి కామెంట్ చేసేసరికి.. కొంద‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ముఖ్యంగా బ‌న్నీ అభిమానులు ఈ విష‌యంపై స‌మంత‌ను ఏకేస్తున్నారు.

స్నేహా పిక్స్‌పై సామ్‌ చేసిన కామెంట్‌ కరెక్ట్ కాదంటూ కొంద‌రు వాధిస్తుంటే.. మ‌రికొంద‌రు హాట్ అన్న దాంట్లో త‌ప్పేంముంది అంటూ సామ్‌కు స‌పోర్ట్ నిలుస్తున్నారు. మొత్తానికి బ‌న్నీ భార్య‌పై స‌మంత `హాట్` కామెంట్ మాత్రం నెట్టింట నానా ర‌చ్చ సృష్టిస్తోంది.