పూజా హెగ్డే.. పరిచయం అవసరం లేని పేరు. కెరీర్ మొదట్లో ఫ్లాపులు ఎదుర్కొన్నా.. ఆ తర్వాత వరుస హిట్లతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఈ బుట్టబొమ్మ ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ మరియు హిందీ భాషల్లో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది.
ఇదిలా ఉంటే..షూటింగ్స్ నుంచి కాస్త విరామం తీసుకున్న పూజా హెగ్డే చిల్ అవడానికి మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ ఆడుతూ పాడుతూ ప్రకృతి అందాలను ఎంజాయ్ చేయడమే కాదు.. బికినీలో రచ్చ రచ్చ చేస్తోంది.
తాజాగా కూడా బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ మధ్యలో బ్రేక్ఫాస్ట్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. మరి లేటెందుకు వాటిపై మీరూ ఓ లుక్కేసేయండి.