పార్కులో నటి పై దాడి.. కారణం..!

November 15, 2021 at 8:30 am

ఈ మధ్యకాలంలో ఎక్కువగా సెలబ్రిటీస్ పైన, ఎవరో ఒకరు దాడి చేస్తూనే ఇప్పుడు తాజాగా హైదరాబాదులో బంజారా హిల్స్ లో ఒక సినీ నటి పై దుండగుడు దాడి చేశాడు. బంజారాహిల్స్ కెబీఆర్ పార్క్ రోడ్ నెంబర్ -9 వద్ద నటి చౌరాసియా పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే క్రమంలో ఆ వ్యక్తితో పెనుగులాటలో చౌరసియాకు గాయాలయ్యాయి. ఈ ఇదే తంతులో ఆ దుండగుడు ఆమె మొబైల్ ను ఎత్తుకెళ్లి నట్లుగా తెలుస్తోంది.

ఇక దాంతో ఆమె ఏమి చేసేది లేక 100 కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో. హుటాహుటిగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నటి ఫిర్యాదు మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాంతో ఆమెను సమీపంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇది ఆదివారం రాత్రి 8:30 నిమిషాల సమయంలో ఆమె వాకింగ్ వెళుతూ ఉండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలియజేశారు.

పార్కులో నటి పై దాడి.. కారణం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts