ఒక్క ట్వీట్‌తో గంద‌ర‌గోళం సృష్టించిన చైతు..అస‌లేమైంది?

అక్కినేని నాగ‌చైత‌న్య.. టాలీవుడ్‌లో హీరోగా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈయ‌న ఇటీవ‌లె భార్య స‌మంత నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సినీ కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన చైతు.. వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. ఇదిలా ఉంటే.. చైతు సోష‌ల్ మీడియాలో ఏ మాత్రం యాక్టివ్‌గా ఉండ‌డు.

Naga Chaitanya Opens Up About OTT Debut

సినిమా ప్రమోషన్స్, పండుగలకు విష్ చేయడం త‌ప్పా.. మిగ‌తా విష‌యాలేమి షేర్ చేసుకోడు. అటువంటి ఆయ‌న తాజాగా ఓ ట్వీట్ చేసి అంద‌రినీ గంద‌ర‌గోళంలో ప‌డేశాడు. అస‌లు ఇంత‌కీ చైతు ఏమ‌ని ట్వీట్ చేశాడంటే.. `గ్రేజీ వాలే`. అవును, త‌న ట్వీట్‌లో గ్రేజీ వాలే అని రాసుకొచ్చాడు చైతు.

Grazie Vale! MotoGP great Valentino Rossi announces retirement - myKhel

దీంతో ఆయ‌న ట్వీట్‌కి అర్థం ఏంటి? అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు. ఒక్క క్షణం పాటు అంద‌రిలోనూ తీవ్ర సందిగ్ధ‌త ఏర్ప‌డింది. అయితే గ్రేజీ వాలే ఓ ఫేమస్ రేసర్‌. అతను నిన్న చివరి రైడ్ చేసి వీడ్కోలు తీసుకున్నాడట. ఇక‌ నాగ చైతన్య కూడా ఓ రేసర్ అన్న సంగతి తెలిసిందే. అందుకే గ్రేజీ వాలే గురించి మన నాగ చైతన్య ట్వీట్ వేశాడ‌న్న‌మాట‌.

https://twitter.com/chay_akkineni/status/1459884360492929031?s=20