బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో తొమ్మిదో వారం కూడా పూర్తి కాబోతోంది. ఈ వారం ఆనీ మాస్టర్, జెస్సీ, ప్రియాంక, మానస్, కాజల్, యాంకర్ రవి, శ్రీరామ్, విశ్వ, సన్నీ, సిరిలు నామినేషన్లో ఉండగా.. వీరిలో ఇప్పటికే ఆనీ మాస్టర్, మానస్లు ఆల్లెడీ సేఫ్ అయిపోయారు.
ఇక మిగిలిన ఎనిమిది మందిలో ఒకరు రేపు ఇంటి బాట పట్టబోతున్నారు. అయితే వారిలో కాజల్, విశ్వ, జెస్సీలు డేంజర్ జోన్లో ఉండగా.. తొమ్మిదో వారం విశ్వ ఎలిమినేట్ కావడం పక్కా అని పలు సర్వేలు చెబుతున్నాయి. నిజానికి ఫిజికల్ టాస్కుల్లో విశ్వ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. కానీ, మిగతా విషయాల్లో బాగా వీక్‌గా కనిపిస్తున్న విశ్వ.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలం అయ్యాడు.
పైగా టాస్కుల్లో మినహా విశ్వాకు స్క్రీన్ స్పేసే లభించడం లేదు. ఈ నేపథ్యంలో అతడు ఈ వారం బ్యాగ్ సద్దేయనున్నాడని టాక్. మరి అతడు ఒకవేళ సేవ్ అయితే జెస్సీ ఇంటి నుంచి బయటకు వెళ్లొచ్చని అంటున్నారు.