విరోధులుగా బాల‌య్య‌-మోహ‌న్ బాబు..అస‌లేమైందంటే?

November 6, 2021 at 9:21 am

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబులు విరోధులుగా మార‌బోతున్నార‌ట‌. అయితే ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదండోయ్‌.. రీల్ లైఫ్‌లోనే. అస‌లు మ్యాట‌రేంటంటే.. టాలీవుడ్ బ‌డా నిర్మాత అల్లు అర‌వింద్ త‌న బ్యాన‌రైన గీతా ఆర్ట్స్​లో బాలయ్య హీరోగా ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని గ‌త కొద్ది రోజుల నుంచీ వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

బాలకృష్ణ సినిమాలో విలన్ గా మోహన్ బాబు | NTV

అతి త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌ను ప్ర‌క‌టించ‌నున్నాడ‌ని కూడా తెలుస్తుండ‌గా.. ఇప్పుడు మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రంలో బాల‌య్య హీరోగా న‌టిస్తే.. ఆయ‌న‌తో త‌ల‌ప‌డే విల‌న్‌గా మోహ‌న్ బాబు న‌టించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది.

Nandamuri Balakrishna Calls Allu Aravind Pottodu

అలాగే ఈ సినిమాను ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ క్రిష్ తెర‌కెక్కించ‌నున్నాడ‌ని టాక్‌. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే. కాగా, బాల‌య్య ప్ర‌స్తుతం అఖండ మూవీ చేస్తున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇక అఖండ‌ త‌ర్వాత గోపీచంద్ మాలినేనితో ఈ మూవీని బాల‌య్య ప‌ట్టాలెక్కించ‌నున్నాడు.

విరోధులుగా బాల‌య్య‌-మోహ‌న్ బాబు..అస‌లేమైందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts