ద‌స‌రా స్పెష‌ల్‌..డ‌బుల్ `ధ‌మాకా` అంటున్న‌ ర‌వితేజ‌..!!

ఇప్ప‌టికే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమాను పూర్తి చేసిన‌ మాస్ మ‌హారాజా ర‌వితేజ.. ప్ర‌స్తుతం శరత్ మందవా దర్శక‌త్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే ఇది పూర్తి కాకుండానే ర‌వితేజ డైరెక్ట‌ర్ త్రినాథరావు నక్కినతో ఓ సినిమా ఉంటుంద‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Ravi Teja to play Tiger Nageshwara Rao

అయితే నేడు ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా.. మేక‌ర్స్ ఈ మూవీ టైటిల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ర‌వితేజ్ డ‌బుల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి `ధ‌మాకా` అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఇక తాజాగా విడుద‌ల చేసిన టైటిల్ పోస్ట‌ర్ ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంది.

Ravi Teja – A Detective in Trinadha Rao Nakkina film?

ఇందులో ర‌వితేజ‌ను రెండు లుక్స్‌లోనూ చూపించారు. మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న ఈ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూర్తి కమర్షియల్‌ హంగులతో మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారు. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు రానున్నాయి.