సినిమాలో ఆ సీన్ చాలా కష్టంగా అనిపించింది హన్సిక!

దేశముదురు ఈ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన హీరోయిన్ హన్సిక ఆ తర్వాత పలు సినిమాలు హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది. అయితే ఇప్పటివరకు తను చేసిన సినిమాలు ఒక సినిమా మాత్రం తనకు టఫ్ గా అనిపించింది అంటోంది హన్సిక. ఆ సినిమా కష్టంగా అనిపించినా కూడా మంచి సినిమా చేశానని ఆనందం దక్కింది అని అంటోంది. మంచి కథతో దర్శక నిర్మాతలు ఒక వినూత్న ప్రయోగం చేశారని, అందులో తాను ఒక ఇరవై నిమిషాల రైన్ షాట్ లో పాల్గొన్నాను, ఆ షాట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది అంటూ ఆమె తెలిపింది.

రాజు దుస్సా దర్శకత్వంలో ఒక క్యారెక్టర్ తో బొమ్మక్ శివ నిర్మించిన చిత్రం 105 మినిట్స్. ఇందులో కథానాయిక గా హన్సిక నటించింది. అయితే విడుదలకు సిద్దంగా ఉన్న ఈ చిత్రం విలేకరుల సమావేశంలో రాజు దుస్సా మాట్లాడుతూ ఈ సినిమాలో ప్రతి ఒక్క షాట్ 20 నుంచి 25 నిమిషాలు ఉంటుందని, ఈ షాట్ ని హన్సిక సింగిల్ టేక్ లో చేశారని తెలిపారు . అలాగే బొమ్మక్ శివ మాట్లాడుతూ హన్సిక సింగిల్ టేక్ లో చేయడం వల్ల ఈ సినిమాను కేవలం ఆరు రోజుల్లోనే పూర్తి చేయగలిగాం, అంతేకాకుండా ఈ సినిమాను త్వరలో విడుదల చేస్తాం అంటూ ఆయన తెలిపారు.